Sangeetha Srinivas Shocking Comments on Revanth: అధికార కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రోటోకాల్ పాటించరు. పై స్థాయిలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వరు. పోనీ సంబోధించే తీరులో గౌరవ వాచకాన్ని పాటించరు. స్థూలంగా చెప్పాలంటే బభ్రజమానం.. భజగోవిందం అనే సామెత నూటికి నూరు శాతం వారికి సరిపోతుంది. తాజాగా జరిగిన ఒక సంఘటన పై ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి అభాసుపాలైంది. విమర్శలకు గురైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే
హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గా వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె సోమాజిగూడ కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె హస్తం పార్టీలో చేరారు.. ప్రస్తుతం ఆమె అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ కార్యకర్తలతో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డి ని గారు అని మాట్లాడబోయి.. “రేవంత్ రెడ్డి గాడు” అని కార్పొరేటర్ సంగీత వ్యాఖ్యానించారు. సహజంగానే ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయడంలో గులాబీ అనుకూల సోషల్ మీడియా విభాగం విపరీతమైన వేగంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియోను కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది..
Also Read: KTR ACB Investigation: ఏసీబీ విచారణ: కేటీఆర్ హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ప్రచారాన్ని కోరుకోవడమే ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్, గులాబీ పార్టీ ఉద్దేశం కాబట్టి.. ఆ విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తోంది.. అయితే సోమాజిగూడ కార్పొరేటర్ మాత్రమే కాదు.. ఇటీవల కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడం మర్చిపోయారు.. ఆ సంఘటనలను కూడా గులాబీ పార్టీ సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేసింది. ముఖ్యమంత్రికి విలువ లేదని.. ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడానికి ఎవరూ ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. దానిని సహజంగానే గులాబీ పార్టీ నాయకులు ప్రతికూలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.. మొదట్లో దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై అనవసరమైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి సొంత పార్టీలో నాయకులు కూడా ముఖ్యమంత్రిని ఇలా విమర్శించడంతో గులాబీ పార్టీ నాయకులకు అనుకోని ఆయుధం లాగా మారింది. దీంతోపాటు సోషల్ మీడియాలో సోమాజిగూడ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యాలను పదేపదే ప్రచారం చేయడం మొదలు పెట్టారు.. ” ముఖ్యమంత్రిని మేమేదో విమర్శిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులూ అంటున్నారు. చివరికి వారే అడ్డగోలుగా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. దీనికి మేమేం చేయాలి. వారి ముఖ్యమంత్రి పట్ల గౌరవం లేకపోతే దానికి మేము బాధ్యులం కాదు కదా.. మేము విమర్శలు చేస్తుంటే మాపై మండిపడుతున్నారని” గులాబీ పార్టీ నాయకులంటున్నారు.
రేవంత్ రెడ్డి గాడు అంటూ నోరు జారిన సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ pic.twitter.com/jTLkGaP5bs
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2025