Homeఎంటర్టైన్మెంట్Sekhar Master debut as director: డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. తొలిసినిమా తోనే...

Sekhar Master debut as director: డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. తొలిసినిమా తోనే స్టార్ హీరో కొడుకుతో ఛాన్స్!

Sekhar Master debut as director: మన టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరు అని అడిగితే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు శేఖర్ మాస్టర్(Shekar Master). గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీ లోకి ఈయన అల్లు అర్జున్ ‘జులాయి’ మూవీ ద్వారా అడుగుపెట్టాడు. ఈ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని చూసి అల్లు అర్జున్ సైతం […]

Sekhar Master debut as director: మన టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరు అని అడిగితే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు శేఖర్ మాస్టర్(Shekar Master). గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీ లోకి ఈయన అల్లు అర్జున్ ‘జులాయి’ మూవీ ద్వారా అడుగుపెట్టాడు. ఈ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని చూసి అల్లు అర్జున్ సైతం ఆశ్చర్యపోయాడు. అక్కడి నుండి మొదలైన ఆయన కెరీర్, మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ, అతి తక్కువ సమయం లోనే నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా, పలు డ్యాన్స్ షోస్ కి ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు.

ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ’ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శేఖర్ మాస్టర్, ఆ తర్వాత పలు కామెడీ షోస్ కి , ఎంటర్టైన్మెంట్ షోస్ కి కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘ఢీ జోడి సీజన్ 2’ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్, త్వరలోనే డైరెక్టర్ గా మారబోతున్నాడు. పాన్ ఇండియా లో హీరో గా , కొరియోగ్రాఫర్ గా , డైరెక్టర్ గా ఎన్నో సంచలనాత్మాక సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభుదేవా కొడుకు రిషిల్ రాఘవేంద్ర దేవా త్వరలోనే హీరో గా ఎంట్రీ ఇవ్వడబోతున్నాడు. ఆయన తొలిచిత్రానికి శేఖర్ మాస్టర్ దర్శకత్వం వహించబోతున్నాడు అట. చాలా కాలం నుండి తన కొడుకు గ్రాండ్ లాంచింగ్ కోసం ప్రభుదేవా అనేక స్టోరీలను వింటూ వస్తున్నాడు. కానీ దేనికి కూడా ఆయన సంతృప్తి చెందడం లేదు.

Also Read: రామ్ చరణ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడా..?

అలాంటి సమయం లో శేఖర్ మాస్టర్ ఆయన వద్దకు ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో రావడం , అది ప్రభుదేవా మాస్టర్ కి తెగ నచ్చి , ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పడం జరిగిందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారట. డ్యాన్స్ మాస్టర్ నుండి డైరెక్టర్ గా మారిన ప్రభు దేవా , లారెన్స్ వంటి వారు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసి, భారీ హిట్స్ ని అందుకున్నారు. మరి ఆ రేంజ్ లో శేఖర్ మాస్టర్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper