Homeఎంటర్టైన్మెంట్Thaai Kizhavi Movie Box Office Collection: కాసులవర్షం కురిపిస్తున్న రాధికా లేటెస్ట్ తమిళ మూవీ..ఎంత...

Thaai Kizhavi Movie Box Office Collection: కాసులవర్షం కురిపిస్తున్న రాధికా లేటెస్ట్ తమిళ మూవీ..ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే మెంటలెక్కిపోతారు!

Thaai Kizhavi Movie Box Office Collection: ఈ కాలం లో కంటెంట్ బాగుంటే చాలు, నటీనటులు ఎవరైనా సరే, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు . అదే కంటెంట్ బాగాలేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాని అయినా దారుణంగా తోక్కేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూశాము. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ రాధికా(Radhika Sarathkumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘తాయి కిజావి'(Thaai Kizhavi) మూవీ గురించి మాట్లాడుకోవాలి. తమిళ […]

Thaai Kizhavi Movie Box Office Collection: ఈ కాలం లో కంటెంట్ బాగుంటే చాలు, నటీనటులు ఎవరైనా సరే, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు . అదే కంటెంట్ బాగాలేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాని అయినా దారుణంగా తోక్కేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూశాము. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ రాధికా(Radhika Sarathkumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘తాయి కిజావి'(Thaai Kizhavi) మూవీ గురించి మాట్లాడుకోవాలి. తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గానే తమిళనాడు లో ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సింపుల్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి గంటకు 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

థియేటర్స్ లో విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. ఈ రెండు వారాల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ రాధికా ఈమధ్య కాలం లో పెద్దగా సినిమాలు చేయలేదు. అడపాదడపా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసింది. అలాంటి ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసి ఇంత పెద్ద కమర్షియల్ హిట్ ని అందుకుంటుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు , ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారు అనేది. అంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చెయ్యాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. అదే కాకునగా జరిగితే ఇక్కడి నుండి కూడా మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

స్టోరీ విషయానికి వస్తే కొడుకులు పక్షవాతం వచ్చిన తమ తల్లికి సేవలు చేసుకోలేక , ఆమె ఎప్పుడెప్పుడు చనిపోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆ క్రమం లో వాళ్లకు తమ తల్లి వద్ద విలువైన నిధులు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఈ కారణం చేత ఆమెని బ్రతికించడానికి, వాళ్ళు చేసే ప్రయత్నాలు చాలా కామెడీ గా అనిపిస్తాయి. అదే సమయం లో హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుందని, అందుకే తమిళ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper