Revanth Reddy Political Strategy: కాంగ్రెస్ పార్టీలో ‘హైకమాండ్’ అంటే ఒకప్పుడు అది ఒక భయం, ఒక భక్తి. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడు సీన్ మారింది. అప్పట్లో వైఎస్సార్ తన ఆత్మబంధువు కేవీపీ కోసం అధిష్ఠానాన్ని ఎలా ఒప్పించేవారో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రూట్ మ్యాప్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!
మేడమ్ చెప్పినా ‘నో’.. రేవంత్ అంటే ‘క్రేజ్’ అబ్బో!
పాపం ప్రియాంక గాంధీ గారు ఎంతో ఆశగా వంశీచంద్ రెడ్డి పేరును సిఫార్సు చేశారట. “మా వంశీకి ఒక అవకాశం ఇవ్వండి” అని ఆమె కోరితే.. “లేదు మేడమ్, మా ‘వేం’ ఉంటేనే మాకు క్షేమం” అని రేవంత్ రెడ్డి మొండికేసినట్లు సమాచారం. మొత్తానికి అధిష్ఠానం పట్టును రేవంత్ తన ‘పట్టు’దలతో సడలించారు. ఢిల్లీ పెద్దల మాట నెగ్గకపోయినా, రేవంత్ మాట నెగ్గడంతో గాంధీ భవన్లో ఇప్పుడు కొత్త నినాదం వినిపిస్తోంది: “హైకమాండ్ ఇచ్చేది బి-ఫామ్ మాత్రమే.. అభ్యర్థిని తేల్చేది మాత్రం రేవంత్ అన్నే!”
సింఘ్వీ గారికి ‘లా’భం.. వేం గారికి ‘రాజ్యం’!
ఇక అభ్యర్థుల ఎంపిక చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి కోర్టుల్లో కష్టమొచ్చినా, పొలిటికల్ కోర్టులో తలనెప్పి వచ్చినా గుర్తొచ్చే ఏకైక పేరు అభిషేక్ మను సింఘ్వీ. ఆయనకు సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్ ఫైళ్లు కదిలేలా లేవు, అందుకే ఆయనకు మళ్ళీ ‘పెద్దల సభ’ టికెట్ ఖరారైంది. కానీ అసలు కిక్కు ఇచ్చింది మాత్రం వేం నరేందర్ రెడ్డి ఎంపికే!
విధేయతకు బహుమతి
రేవంత్ రెడ్డి కష్టాల్లో ఉన్నా, కారాగారంలో ఉన్నా వెన్నంటి ఉన్నందుకు నరేందర్ రెడ్డికి ‘రాజ్య’యోగం పట్టింది. రెడ్డి కోటాకే పట్టం కట్టింది. “అన్నీ వేరే వాళ్ళకే ఇస్తున్నారు.. మా వాళ్ళ సంగతేంటి?” అని రేవంత్ వేసిన రెడ్డి కార్డు ముందు ప్రియాంక గాంధీ మార్కు పాలిటిక్స్ కూడా పని చేయలేదు.
విపక్షం ఖాళీ.. ఎన్నిక ఏకగ్రీవం!
అసెంబ్లీలో ప్రతిపక్షం బిఆర్ఎస్ పరిస్థితి ‘సైలెంట్ మోడ్’లో ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులకు పోలింగ్ అవసరం లేకుండానే గెలుపు ఖాయమైపోయింది. నామినేషన్ వేయడమే ఆలస్యం.. గెలుపు గుర్రాలు రెడీ!
ఢిల్లీలో చక్రం తిప్పే పెద్దల ముందు, తెలంగాణ ‘రీజనల్’ చక్రం గట్టిగా తిరిగింది. వంశీచంద్ రెడ్డికి ప్రియాంక హస్తం ఉన్నా.. వేం నరేందర్ రెడ్డికి మాత్రం రేవంత్ ‘మస్తీ’ తోడైంది!