Ration Rice : తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ఉగాది(Ugadi) నుంచి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. అయితే వారం రోజులైనా రాష్ట్రంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ పంపిణీ మొదలు పెట్టలేదు. చాలా రేషన్ షాపులు మూసివేయడం, స్టాక్ కొరత, సర్వర్ సమస్యలతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.
Also Read : తెలంగాణ సీఎస్ కు కీలక పదవి ఇస్తోన్న సీఎం రేవంత్
పంపిణీలో అడ్డంకులు
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపు(Ration Shops)ల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. అయితే, పలు జిల్లాల్లో షాపులకు తగినంత స్టాక్(Stock) చేరకపోవడంతో లబ్ధిదారులు ఖాళీ చేతులతో వెనుదిరిగారు. కొన్ని చోట్ల షాపులు తెరిచినా, సర్వర్ సమస్యల(Sarvar Problems) కారణంగా బియ్యం పంపిణీ ఆగిపోయింది. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడిన పేదలు సాయంత్రం వరకు బియ్యం లేకుండా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
స్టాక్ కొరత, నాణ్యతపై ఫిర్యాదులు
కొన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం సంచుల్లో నూకలు ఎక్కువగా ఉండటం, బియ్యం నాణ్యత(No quality) సరిగా లేకపోవడంపై లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సన్న బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం ఇవ్వడం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. రేషన్ డీలర్లు(Ration Delars) స్టాక్ రాకపోవడం, అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో తాము కూడా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.
పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు..
ప్రభుత్వం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది. కలెక్టర్లు(Collectars), పౌర సరఫరాల అధికారులు(Civil supply officers) స్టాక్ సరఫరా, నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, నిత్యావసర సరుకుల కిట్ పంపిణీ వంటి పథకాలతో లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు పేదలకు నిరాశ కలిగిస్తున్నాయి.
సన్న బియ్యం పంపిణీ పథకం తెలంగాణలో పేదలకు ఊరట కలిగించాల్సిన పథకం అయినా అమలులో లోపాలు లబ్ధిదారులను కలవరపెడుతున్నాయి. స్టాక్ కొరత, సర్వర్ సమస్యలు, నాణ్యత లోపాలను అధిగమించి, పారదర్శక పంపిణీని నిర్ధారించడం ద్వారా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొనాల్సిన అవసరం ఉంది.