KKR vs LSG : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా ఓవర్ కు 7+ పరుగులు ఇచ్చారు. మిగతా వారు ఏకంగా 16 వరకు రన్స్ ఇచ్చారు. హర్షిత్ రాణా 2, రస్సెల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు ఎక్స్ ట్రా ల రూపంలో 13 పరుగులు ఇచ్చారు.. ఇందులో బై స్ రూపంలో రెండు, లెగ్ బైస్ రూపంలో మూడు, వైడ్ల రూపంలో ఎనిమిది పరుగులు ఇచ్చారు. మొత్తంగా 13 పరుగులు ఉత్తి పుణ్యానికి లక్నో జట్టుకు సమర్పించుకున్నారు..కోల్ కతా బౌలర్లు డౌన్ లెగ్ లో తొమ్మిది బంతులకు 30 పరుగులు ఇచ్చారు. ఇందులో ఎకానమీ రేటు 20% గా ఉంది. స్టంప్స్ వైపు 19 బంతుల్లో 55 పరుగులు ఇచ్చారు. ఇందులో ఎకనామి రేటు 17.37 శాతంగా ఉంది. అవుట్ సైడ్ లేదా వైడర్ రూపంలో 50 బంతుల్లో 73 పరుగులు ఇచ్చారు. ఇక్కడ ఎకానమీ రేటు 8.76 శాతంగా ఉంది. ఇక ఇక్కడే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు మూడు వికెట్లు తీశారు..
Also Read : పూరన్ విధ్వంసానికి పరాకాష్ట.. ఈడెన్ గార్డెన్స్ కే పూనకాలు తెప్పించాడు..
లక్నో జట్టు అరుదైన ఘనత
మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో లక్నో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అయితే చాలామంది ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం చేసిన పరుగులే హైయెస్ట్ స్కోర్ అని అనుకుంటున్నారు. కానీ లక్నో జట్టు హైయెస్ట్ స్కోర్ రికార్డు 2023 లో సాధించింది.మొహాలీ వేదికగా కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ నష్టానికి 257 పరుగులు చేసింది. లక్నో జట్టు తరఫున ఇదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. మంగళవారం కోల్ కతా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. గత సీజన్లో ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుపై లక్నో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 2022 సీజన్లో ముంబై వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై ఒక వికెట్ కోల్పోకుండా 210 పరుగులు చేసింది. 2025లో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అయితే ఒకానొక దశలో మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో మొహాలీలో 2023లో పంజాబ్ జట్టు పై నెలకొల్పిన 257 పరుగుల రికార్డును బద్దలు కొడుతుందని అందరూ అనుకున్నారు. అయితే పూరన్ కు మిల్లర్, అబ్దుల్ సమద్ నుంచి సహకారం లభించకపోవడంతో.. 238 పరుగుల వరకే ఆగిపోయింది.
POORAN MADNESS AT EDEN pic.twitter.com/y1RmNgAaS8
— Johns. (@CricCrazyJohns) April 8, 2025