CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy).. ఇటీవల రిటైర్మెంట్ తర్వాత కూడా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 400 మందికిపైగా అధికారులను తొలగించారు. రిటైర్మెంట్ అయిన వారిని కేసీఆర్(KCR) ప్రభుత్వం కనొసాగించి.. ప్రస్తుతం పదవిలో ఉన్నవారికి ప్రమోషన్లు రాకుండా చేసిందని ఆరోపించారు. అయితే తాజాగా రేవంత్ కూడా గత పాలకుల లాగానే నిర్ణయం తీసుకోబోతున్నారు.
Also Read: సన్నబియ్యం ఇచ్చారు.. పేదోడి ఇంట భోజనానికి వెళుతున్నారు..
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సీఎస్ శాంతి కుమారి(Shanthi Kumari) ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రాజ్యాంగబద్ధ పదవుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమా(Bhatti Vikramarka)ర్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్(Prasad Kumar), మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కూడిన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఆహ్వానించినప్పటికీ, ఆయన హాజరు కాలేదు.
కీలక పదవులపై చర్చ..
సమాచార హక్కు చట్టం, లోకాయుక్త, ఉపలోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్(Human Rights Comission Chairman), సభ్యుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ పదవులకు ఎవరిని నియమించాలనే దానిపై ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో శాంతి కుమారికి సమాచార కమిషనర్ పదవి దాదాపు ఖాయమని సమాచారం. గతంలో సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) క్యాడర్‌కు చెందిన అధికారిగా ఉండి, కోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లాల్సి రావడంతో, 2023 జనవరి 11న కేసీఆర్ శాంతి కుమారిని చీఫ్ సెక్రటరీగా నియమించారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి ఆమెను కొనసాగించారు, ఇది ఆమె సామర్థ్యానికి నిదర్శనం.
కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు..
ఇక శాంతికుమారి తర్వాత చీఫ్ సెక్రటరీగా రామకృష్ణా రావు(Ramakrishna Rao) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 1991 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణా రావు, కేసీఆర్ సన్నిహిత అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 10 బడ్జెట్‌లను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా కూడా ఆయన సేవలందించారు. అయితే, తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పదవీ కాలం 2023లోనే ముగిసినప్పటికీ, ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. ఈ నేపథ్యంలో శాంతి కుమారి నియామకం రాష్ట్ర పాలనలో పారదర్శకతను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కీలక పదవుల భర్తీతో రాష్ట్ర పాలనలో కీలక మార్పులను తీసుకురావచ్చని, అనుభవజ్ఞులైన అధికారులకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ విధానాల అమలు సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.