KKR vs LSG : లక్నో జట్టులో దిగ్వేష్ రాటి అనే ఓ బౌలర్ ఉన్నాడు.. ఎత్తయిన జుట్టుతో.. మంచి పొడవుతో ఉంటాడు. బంతులు కూడా మెరుగ్గానే ఇస్తాడు. తనదైన రోజు వికెట్లు కూడా పడగొడతాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో దిగ్వేష్ రాటి 3 ఓవర్ లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు.. అయితే అతడు తీసిన వికెట్ మామూలుది కాదు. తనకు గురువైన సునీల్ నరైన్ ది.. దిగ్వేష్ రాటి నరైన్ వద్దే బౌలింగ్లో మెలకువలు నేర్చుకున్నాడు. అందువల్లే అతడు సత్తా చాటుతున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న ఐపిఎల్ సీజన్లో లక్నో జట్టు తరఫున సంచలన బౌలింగ్ వేస్తున్నాడు. సునీల్ వికెట్ తీయగానే దిగ్వేష్ ఏం చేస్తాడోనని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఈసారి కూడా “సంతకం” చేస్తాడా? అని అందరూ అనుకున్నారు.. కానీ ఈసారి భిన్నంగా వ్యవహరించాడు. పిచ్ పై బంతిని అదే పని రుద్దాడు. తను వికెట్ తీసిన సందర్భంలో ఆనందాన్ని ఆ విధంగా పంచుకున్నాడు.
Also Read : లక్నో 238 కొట్టినా.. ఇదే హైయెస్ట్ కాదు.. గతంలో ఎవరి మీద చేసిందంటే..
మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది
కోల్ కతా జట్టు లో క్వింటన్ డికాక్ (15), సునీల్ నరైన్ (30) ఓపెనర్లుగా వచ్చారు. వీరిద్దరి తొలి వికెట్ కు 3.3 ఓవర్లలో 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . క్వింటన్ డికాక్ అవుట్ కావడంతో.. వన్ డౌన్ ఆటగాడిగా అజంక్యా రహానే (61) వచ్చాడు. రహానే, సునీల్ రెండో వికెట్ కు 23 బంతుల్లో 54 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని దిగ్వేష్ విడదీశాడు. దిగ్వేష్ చేసిన ఏడో ఓవర్ రెండో బంతికి భారీ షాట్ కొట్టిన సునీల్ నరైన్ మార్క్రం కు దొరికిపోయాడు. 13 బంతుల్లో నాలుగు ఫోర్లు , రెండు సిక్సర్ల సహాయంతో సునీల్ 30 పరుగులు చేశాడు. అయితే అతడు గనుక అలాగే ఉండి ఉంటే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. అతడు అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మరో ఎండ్ లో రహానే, వెంకటేష్ అయ్యర్ (45) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఇన్నింగ్స్ కుదుపులకు గురైంది. రమణ్ దీప్ సింగ్(1), రఘువంశి (5), రస్సెల్(7) వెంట వెంటనే వెను తిరగడంతో.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది.. ఈ కథనం రాసే సమయానికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
DIGVESH GETS HIS IDOL, SUNIL NARINE pic.twitter.com/x2XaWh4Hn9
— Johns. (@CricCrazyJohns) April 8, 2025