Ambati Rayudu: దుబాయ్ వేదిక జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆశించినంత స్థాయిలో టీమిండియా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. 241 పరుగులకే కుప్పకూలింది. 242 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి.. ఆ లక్ష్యాన్ని చేదించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేసి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. తద్వారా టీమిండియా 2017లో ఎదురైన ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమికి బదులు తీర్చుకుంది. అంతేకాదు సెమీఫైనల్ వెళ్లే దారులను మరింత పటిష్టం చేసుకుంది.
ర్యాగింగ్ చేసిన అంబటి రాయుడు
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాకిస్తాన్ తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ను చూసేందుకు మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు మొత్తం అక్కడికి వెళ్లిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్, ఏపీఐటి శాఖ మంత్రి నారా లోకేష్.. చాలామంది ప్రముఖులు దుబాయ్ లో టీమిండియా పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ ను వీక్షించారు. అయితే సెలబ్రిటీలను ఉద్దేశించి అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. టీమిండియా – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తెలుగులో కూడా కామెంట్రీ నిర్వహించింది. ఇందులో అంబటి రాయుడు కూడా పాల్గొన్నాడు. తెలుగులో అతడు తన వ్యాఖ్యానాన్ని అందించాడు. ” ఇలాంటి మ్యాచ్ లకు సెలబ్రిటీలు ఎందుకు వస్తారు అంటే.. భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు జనం విపరీతంగా వస్తారు. వారిని మీడియా కూడా విస్తృతంగా చూపిస్తుంది. అందువల్లే ఇలాంటి మ్యాచ్లను చూసేందుకు సెలబ్రిటీలు ఎక్కువగా వస్తుంటారు. దానివల్ల వారు మరింత ప్రాచుర్యాన్ని పొందుతారు. ఇది పబ్లిసిటీ స్టంట్. అది పవర్ ఆఫ్ క్రికెట్ అని” అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. అయితే ఈ మ్యాచ్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడంతో.. ఆయనను ఉద్దేశించే అంబటి రాయుడు ఈ కామెంట్లు చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. మరోవైపు అంబటి రాయుడు ఈ విషయం మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే అతడు అన్న మాటలు సెలబ్రిటీలకు గట్టిగా తగిలాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఐతే చిరంజీవిని ఉద్దేశించి అంబటి రాయుడు ఆ వ్యాఖ్యలు చేయలేదని.. సెలబ్రిటీలు ఎక్కువగా హాజరు కావడం వల్లే అతడు అలాంటి మాటలు మాట్లాడి ఉంటాడని.. ఇందులో వేరే అర్థం వెతుక్కోవద్దని చిరంజీవి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
— Out Of Country (@outofcountrytel) February 23, 2025