Raja Singh: భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. రామచంద్ర రావుకు గతంలో ఎమ్మెల్సీ గా పనిచేసిన అనుభవం ఉంది. మరోసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు.
Also Read: ఆంధ్రజ్యోతిలో టార్చర్.. చనిపోతానంటూ రిపోర్టర్ వీడియో వైరల్
విషయ పరిజ్ఞానం.. స్పష్టంగా మాట్లాడగలిగే సత్తా.. హిందీ, ఇంగ్లీష్ భాషల మీద అపారమైన పట్టు కలిగిన వ్యక్తిగా రామచంద్రరావుకు పేరు ఉంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు చట్టసభలో ప్రజా సమస్యలను ఆయన లేవనెత్తారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా ఆయన ప్రయత్నించారు. మొత్తంగా వివాదరహితుడిగా.. సున్నిత మనస్కుడిగా రామచంద్రరావు పేరు తెచ్చుకున్నారు. అయితే తనను అధ్యక్షుడిగా నియమించడం పట్ల రామచంద్రరావు ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. రామచంద్రరావు ను అధ్యక్షుడిగా నియమించినట్టు ఇప్పటికే పార్టీ పెద్దలు కొంతమంది నాయకులకు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష రేసులో రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి రావడం.. ఆయనను అధిష్టానం ఖరారు చేయడం గమనార్హం. అయితే చాలామంది నాయకులు తమకు అధ్యక్ష పదవి వస్తుందని సన్నిహితుల మధ్య చెప్పుకోవడం విశేషం. వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్టానం రామచంద్రరావు పేరును ఖరారు చేయడం మీడియా వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కమలం పార్టీలో అసంతృప్త నాయకుడిగా ఉన్న రాజాసింగ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.. “రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని పార్టీ అధిష్టానం నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను. కానీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీ అధిష్టానం ఒక విధానాన్ని అనుసరించాలి. బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు ఓటు వేసే విధానాన్ని కల్పించాలి. అలా అధిక ఓట్లు సాధించిన వారిని అధ్యక్షుడిగా నియమించాలి. నచ్చిన వాళ్లను అధ్యక్షులుగా నియమించుకుంటూ పోతే పార్టీకి నష్టం చేకూరుతుందని” రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో రాజా సింగ్ పార్టీ అధిష్టానం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో కొందరి పెత్తనం పెరిగిపోయిందని.. వారి వల్లే అధికారంలోకి రాలేకపోతుందని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీ రాష్ట్రంలో ఎరుగలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే గోషామహల్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇక ఆదివారం అమిత్ షా నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో.. అగ్ర నాయకులు మొత్తం ఒకే వేదికను పంచుకున్నారు. తమ మధ్య విభేదాలు లేవని చెప్పడానికి ప్రయత్నించారు. అమిత్ షా పర్యటించే ఒకరోజు కూడా కాకముందే.. రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
నా మనిషి, నీ మనిషి అనుకుంటూ పోతే.. పార్టీ సర్వనాశనం అవుతుంది
రామచందర్ రావుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేయడంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే.. బూత్ కార్యకర్త ప్రెసిడెంట్ కావాలని రాజాసింగ్ అభిప్రాయం#RajaSingh #TelanganaBJPPresident… pic.twitter.com/SeASUhh3aS
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 30, 2025