Homeఆంధ్రప్రదేశ్‌PVN Madhav AP BJP President: నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఏపీ బిజెపికి...

PVN Madhav AP BJP President: నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఏపీ బిజెపికి కొత్త సారథి

PVN Madhav AP BJP President: ఏపీ బిజెపి కొత్త సారథిగా పివిఎన్ మాధవ్( pvn Madhav ) నియమితులయ్యారు. కొద్దిసేపటి కిందటి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. హై కమాండ్ ఆయన పేరును సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికల లాంఛనమే. సరిగ్గా రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు ఆ పదవిలో దగ్గుబాటి పురందేశ్వరి కొనసాగారు. ప్రస్తుతం ఆమె పదవీకాలం ముగిసింది. మరో రెండేళ్ల పాటు ఆమె కొనసాగింపు ఉండవచ్చని అంతా భావించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలిగా కూడా ఉన్నారు. త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు నాటకీయ పరిణామాల నడుమ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ నియమితులు కావడం విశేషం. ఆయన తండ్రి పివి చలపతిరావు భారతీయ జనతా పార్టీలో విశేష సేవలు అందించారు. అటు తరువాత మాధవ్ సేవలను పరిగణలోకి తీసుకొని ఆయనకు బిజెపి పెద్దలు బాధ్యతలు అప్పగించారు.

Also Read: ఆంధ్రజ్యోతిలో టార్చర్.. చనిపోతానంటూ రిపోర్టర్ వీడియో వైరల్

* సీనియర్ మోస్ట్ లీడర్
ఉమ్మడి రాష్ట్రంలోనే పీవీ చలపతిరావు( PV chalapathi Rao ) సీనియర్ మోస్ట్ లీడర్. పదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి సేవలందించారు. పారిశ్రామిక విస్తరణ అధికారిగా పనిచేసిన చలపతిరావు 1966లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1967లో విశాఖ ఉక్కు ఉద్యమంలో, 1973లో ప్రత్యేక ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఎమర్జెన్సీ సమయంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. 19 నెలల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1980 నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1974, 1980లో పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తొలినాళ్లలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు పివి చలపతిరావు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలకు సమకాలీకుడు పీవీ చలపతిరావు. 2023 జనవరి 1న మరణించారు.

* పీవీ చలపతిరావు వారసుడిగా
పీవీ చలపతిరావు వారసుడిగా బిజెపిలోకి( Bhartiya Janata Party) ఎంట్రీ ఇచ్చారు పివిఎన్ మాధవ్. 2017లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసేందుకు టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. అయినా సరే పార్టీతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాధవ్ కు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు చాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతగా గుర్తిస్తూ రాష్ట్ర పగ్గాలు అందించారు. ఆయన తండ్రి సుధీర్ఘ నేపథ్యం.. వారసుడిగా మాధవ్ పార్టీకి సేవలు వంటివి పరిగణలోకి తీసుకొని బిజెపి పెద్దలు ఈ యువనేత వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బిజెపి బీసీ ఫార్ములాను నమ్ముకుంది. బీసీ నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే మాధవ్ కు అవకాశం దక్కినట్లు ప్రచారం సాగుతోంది.

* చాలామంది ఆశావహులు ఉన్నా
అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని చాలామంది నేతలు కోరుకున్నారు. ప్రముఖంగా సీనియర్ నేత సుజనా చౌదరి( Sujana Chaudhari ) పేరు వినిపించింది. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు సైతం బయటకు వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు పలువురు నేతలు సైతం ఈ పదవిని ఆశించారు. కానీ అందర్నీ వెనక్కి నెట్టి పీవీఎన్ మాధవ్ పదవి సొంతం చేసుకున్నారు. మాధవ్ ఎంపిక వెనుక ఎంపీ సీఎం రమేష్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్. ఆ సమయంలో మాధవ్ ఎంతగానో సహకరించారని.. అందుకే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించి సీఎం రమేష్ కేంద్ర పెద్దల వద్ద పావులు కదిపారని తెలుస్తోంది. మొత్తానికి అయితే దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకరైన పీవీ చలపతిరావుకు ఇలా కుమారుడి ద్వారా గుర్తింపు లభించినట్లు అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular