Pasamailaram Blast: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఇండస్ట్రీస్‌లో జూన్30న భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 40 మంది ఉద్యోగులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియడం లేదు. దీంతో తమ వారి కోసం కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్ప్రే డ్రైయర్‌లో సాంకేతిక లోపం ఈ పేలుడుకు కారణమని నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన రాష్ట్రంలో అత్యధిక ప్రాణనష్టాన్ని కలిగించిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటి. అయితే బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ బాధితులకు న్యాయం జరుగలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వేగంగా సహాయక చర్యలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనాస్థలిని సందర్శించి, బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలుగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ప్రకటించింది, గాయపడినవారి వైద్య ఖర్చులను భరించేందుకు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు, బాధితుల సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.
Also Read: కవిత సీఎం అవుతుందట.. కేటీఆర్ కు ఎసరు పెట్టినట్టే?
ఒక్కొక్కరిదీ ఒక్కో వేదన..
ఈ ప్రమాదంలో ఇటీవలే పెళ్లి చేసుకున్న దంపదుతు దుర్మరణం చెందారు. నెలలు నిండిన గర్భిణి భర్త ఆచూకీ లేకుండా పోయింది. రెండు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన వ్యక్తి మరణించాడు. మృతుల్లో చాలా మంది స్థానికేతరులే. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియన మౌనంగా రోదిస్తున్నారు.
మంత్రుల పర్యవేక్షణ..
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతోపాటు శ్రీధర్‌బాబు, వివేక్ ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. సిగాచీ యాజమాన్యంతో చర్చలు జరిపి మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందేలా కృషి చేశారు. కలెక్టర్ ప్రావీణ్య తక్షణ సాయం అందించేందుకు నోట్‌బుక్‌లో వివరాలు నమోదు చేస్తూ బాధిత కుటుంబాలకు సహాయం అందజేశారు. అయినప్పటికీ, శిథిలాల తొలగింపు కొనసాగుతుండటం, 11 మంది ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన కొనసాగుతోంది.
Reactor blast at #Patancheru Chemical Unit
A reactor blast at Seegachi Chemicals in #Pasamailaram industrial area reportedly killed several workers and injured 20+.
Factory engulfed in flames; rescue ops underway.#Fire engines & ambulances at spot.
Death toll… pic.twitter.com/1uRxcm2YY9
— NewsMeter (@NewsMeter_In) June 30, 2025
సిగాచీ యాజమాన్యం స్పందన..
సిగాచీ ఇండస్ట్రీస్ యాజమాన్యం బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించడంతోపాటు, గాయపడినవారి వైద్య ఖర్చులను భరించేందుకు హామీ ఇచ్చింది. 35 ఏళ్లుగా కంపెనీ నడుస్తున్నప్పటికీ ఇలాంటి ప్రమాదం జరగలేదని, ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. అయితే, రియాక్టర్ పేలుడు కాదని, కచ్చితమైన కారణాల కోసం ప్రభుత్వ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది.
Also Read: యుద్ధానికి సిద్ధంగా ఉన్న.. ఇప్పుడే కత్తి బయటకు తీశా!
బాధితులకు న్యాయం జరిగిందా?
ప్రభుత్వం, సిగాచీ యాజమాన్యం ప్రకటించిన పరిహారం బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించినప్పటికీ, న్యాయం అనేది కేవలం ఆర్థిక పరిహారంతోనే పరిమితం కాదు. బాధిత కుటుంబాలు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఆరాటపడుతున్నారు, మరికొందరు శవాలను కూడా చూడలేకపోయారు. ఈ ఘటనకు కారణమైన సాంకేతిక లోపాలు, నిర్వహణ లోపాలపై సమగ్ర విచారణ జరిగి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారానే న్యాయం పూర్తవుతుందని బాధితులు భావిస్తున్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిపుణుల కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నప్పటికీ, ఇంకా సమగ్ర నివేదిక వెలువడలేదు.
Reactor Blast at Sigachi Industries Pvt Ltd in Pasamailaram village of #Medak district, at least 15 to 20 people are said to be injured. 11 fire vehicles deployed at the incident spot. #Reactorblast pic.twitter.com/gtCnOsra8h
— Aneri Shah Yakkati (@tweet_aneri) June 30, 2025
పాశమైలారం పేలుడు ఘటన బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం, సిగాచీ యాజమాన్యం చొరవ చూపినప్పటికీ, న్యాయం పూర్తిగా అందినట్లు చెప్పడం కష్టం. శిథిలాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలియకపోవడం, ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ ఇంకా పూర్తి కాకపోవడం బాధిత కుటుంబాల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కఠిన విధానాలు, సమయోచిత విచారణ, బాధ్యులపై చర్యలు లేనిదే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది.
#Telangana: Sigachi Industries Limited announced ₹1 Crore to the families of the deceased in the Pashamylaram Blast.
In a press release, they announced that there were 40 deaths and 33 injured due to the incident.
They also announced full support for medical expenses and… pic.twitter.com/f0kFtLoLDG
— South First (@TheSouthfirst) July 2, 2025