Building Trust: జీవితం అనేది నమ్మకం అనే ఇరుసుపై ఆధారపడుతుంది అని కొందరు మేధావులు సూక్తులు చెబుతూ ఉంటారు. అయితే వారు చెప్పిన ప్రకారమే జీవితం అనేది ఒక నమ్మకం పైనే ముందుకు సాగుతుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని నమ్మిన తర్వాతే బంధాలు, బంధుత్వాలు పెరుగుతాయి. వ్యాపారులపై కొనుగోలుదారులకు నమ్మకం ఏర్పడితేనే వారి అభివృద్ధి ముందుకు సాగుతుంది. అలాగే కంపెనీపై నమ్మకం ఏర్పడితేనే ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించగలుగుతారు. ఇలా ప్రతి విషయంలో నమ్మకం అనేది ప్రధానంగా నిలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో తమ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఇంకొన్ని సందర్భంలో కొందరు ఎంత నిజాయితీగా ఉన్నా.. వారిని మాత్రం ఎవరూ నమ్మరు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?
సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కానీ కొందరు మాత్రమే మంచి వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తే వారు కూడా అలాగే ఉంటారని కొందరు మేధావులు చెబుతూ ఉంటారు. అయితే ఇతర వ్యక్తుల మధ్య బంధం బలంగా ఉందంటే అందుకు కారణం నమ్మకమే అని అనుకోవాలి. ఈ నమ్మకం విషయంలో ఇరువురు వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మాట్లాడే సమయంలోనూ.. ఇతర విషయాల్లోనూ సంయమనం పాటిస్తూ ఉండాలి.
Also Read: ఓజీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అప్పుడేనా..? ట్రైలర్ వచ్చే డేట్ ను లాక్ చేసిన ప్రొడ్యూసర్…
ఉదాహరణకు ఒక వ్యక్తి తాను ఎంతో మంచివాడిగా ఉంటున్నా.. తనను మాత్రం ఎవరు నమ్మడం లేదని కొందరు అంటూ ఉంటారు. అయితే అతను నిజాయితీగా ప్రవర్తిస్తే మాత్రం ఇతరుల నమ్మకంతో పనిలేదు. ఎందుకంటే తన మంచితనంను ఇతరులు పొందలేకపోవడం కూడా కారణం కావచ్చు. అలా కాకుండా ఆ వ్యక్తి మూర్ఖుడు అయితే అనుకోకుండానే నమ్మకాన్ని కోల్పోతాడు. అయితే నమ్మకం విషయంలో నిజాయితీగా ఉంటేనే బంధం ఎప్పటికైనా బలంగా ఉంటుంది. సంస్థలు, కంపెనీల మధ్య నమ్మకం ఉంటేనే అభివృద్ధి సాధిస్తుంటారు.
ఒక కంపెనీ తనకు సంబంధించిన వస్తువును మార్కెట్లో విజయవంతంగా విక్రయించుకోవాలంటే నమ్మకమైన విధంగా నడుచుకోవాలి. అంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ పై కొనుగోలుదారులకు నమ్మకం కలిగేలా చేయాలి. అలాగే ఒక కంపెనీ బాగుంది అని ఉద్యోగులు నమ్మినప్పుడే తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. లేకుంటే ఆ కంపెనీలో నుంచి ఉద్యోగులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు.
Also Read: హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ లో క్రిష్ లేని లోటు తెలిసిపోతుందా..? ఆయన ఉంటే ఆ తప్పు జరిగేది కాదా..?
అయితే నమ్మకం అనేది ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ పై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి మంచివాడు అయితే కొంతమంది జీవితాంతం నమ్ముతూ ఉంటారు. కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగినా సర్దుకొని ముందుకు సాగుతారు. కానీ ఆ వ్యక్తి మంచివాడు కాదని తెలిస్తే చిన్న విషయానికే మనస్పర్ధలు జరిగి నమ్మకం కోల్పోతారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే మన మీద ఎదుటివారికి నమ్మకం కలగాలంటే నిజాయితీగా ఉండడమే సరైన మార్గం.
అలా కాకుండా అతి తెలివితో ప్రవర్తిస్తే ఎప్పటికైనా ప్రమాదమే అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సైతం నమ్మకం ఉండాలి. ఇందుకోసం ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది.