Homeఆంధ్రప్రదేశ్‌HIV Cases: తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ డెంజర్‌ బెల్స్‌

HIV Cases: తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ డెంజర్‌ బెల్స్‌

HIV Cases: తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. గతంలో కేసులు తగ్గినా.. ఇటీవలికాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో మరణాలు పెరుగుతున్నాయి. కేంద్రం ప్రకారం, 2020–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది హెచ్‌ఐవీతో మరణించారు. మొత్తం 44,140 మరణాలు రికార్డు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మరణాలు..
ఏపీలో హెచ్‌ఐవీ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్, చికిత్స సౌకర్యాల కొరత, అవగాహన లోపం కారణంగా వ్యాధి బాధితులు మరణిస్తున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఈ ట్రెండ్‌ను అరికట్టే చర్యలు చేపట్టాలి.

తెలంగాణలోనూ ఆందోళనకరం
తెలంగాణలో 11,498 మరణాలు రికార్డయ్యాయి. నగరాల్లో ఏఆర్‌టి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, గ్రామాల్లో వ్యాప్తి, టెస్టింగ్‌ లోపాలు సమస్య. యువతలో వ్యాప్తి పెరుగుతోంది. వైరస్‌ గుర్తింపులో జాప్యం కారణంగా మరణాలు జరుగుతున్నాయి. వైద్య సేవల ఆలస్యం, స్టిగ్మా, టెస్టింగ్‌లో భయం మరణాలకు దారితీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.

హెచ్‌ఐవీ మరణాలు రెండు రాష్ట్రాల వైద్య వ్యవస్థల్లో లోపాలను సూచిస్తున్నాయి. ఉచిత టెస్టింగ్, ఏఆర్‌టీæ మందులు, అవగాహన కార్యక్రమాలు పెంచాలి. యువతపై దృష్టి పెట్టి, స్క్రీనింగ్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తే మరణాలు తగ్గుతాయి. కేంద్ర, రాష్ట్రాలు కలిసి చర్యలు తీసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular