Parking Fee Rules
Parking Fee Rules: తెలంగాణలోని వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందాయి. మున్సిపల్ శాఖ(Muncipal department) జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, ఈ నియమాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రజలకు సౌలభ్యం కల్పించడం, అనవసర ఖర్చులను తగ్గించడమే ఈ నిబంధనల లక్ష్యంగా కనిపిస్తోంది.
Also Read: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. కొత్తగా నలుగురికి ఛాన్స్.. రేసులో వీరు..!
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రజలపై పార్కింగ్ భారం తగ్గించడమే లక్ష్యంగా నూతన పార్కింగ్ పాలసీ రూపొందించింది. ఈ కొత్త పాలసీని ఏప్రిల్ 1(April 1st) నుంచి అమలు చేయనుంది. కొత్త ఆదేశాల ప్రకారం, ఏదైనా వాణిజ్య సముదాయం లేదా మాల్‌లో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ ఫీజు(Parkig fee) వసూలు చేయడానికి వీల్లేదు. ఈ సమయంలో వాహనదారులు ఎలాంటి చెల్లింపు లేకుండా పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అదనంగా, 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు పార్కింగ్ చేసే వారు, తాము కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులను చూపించినట్లయితే ఫీజు నుంచి మినహాయింపు పొందవచ్చు. ఇది కొనుగోలుదారులకు అదనపు ఊరటనిచ్చే నిర్ణయంగా ఉంది.
సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లో..
ఇక సినిమా ప్రేక్షకులు లేదా ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసిన వారికి మరింత సౌలభ్యం కల్పించారు. సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ విలువైన వస్తువుల కొనుగోలు బిల్లు చూపిస్తే, ఒక గంటకు మించి కూడా ఉచిత పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ నిబంధనలు వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, వాణిజ్య సముదాయాల్లో కొనుగోళ్లను ప్రోత్సహించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 1 నుంచి..
ఈ ఆదేశాలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నందున, సంబంధిత వ్యాపార సంస్థలు తమ పార్కింగ్ విధానాలను సవరించుకోవాల్సి ఉంటుంది. ఈ నియమాలు ప్రజలకు సానుకూలంగా ఉన్నప్పటికీ, వాణిజ్య సముదాయాల నిర్వహణ సంస్థలు ఆదాయ నష్టం గురించి ఆందోళన వ్యక్తం చేయవచ్చు. అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఈ చర్యలు కస్టమర్ల సంఖ్యను పెంచి, వ్యాపారాలకు పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది.
Also Read: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ‘కొండా’ఔట్, రేవంత్ కొత్త టీమ్ రెడీ!