Homeటాప్ స్టోరీస్Revanth Reddy on Kaleshwaram project: కాళేశ్వరం భారం తగ్గించుకుంటున్న రేవంత్‌రెడ్డి..

Revanth Reddy on Kaleshwaram project: కాళేశ్వరం భారం తగ్గించుకుంటున్న రేవంత్‌రెడ్డి..

Revanth Reddy on Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద లిఫ్‌ ఇరిగేషన్‌ పథకం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు రూ.90 వేల కోట్లు చెల్లించి దీనిని నిర్మించింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం భారీగా రుణాలు తెచ్చింది. అధిక వడ్డీలకు అప్పులు చేసింది. ఇంకా ప్రాజెక్టు పూర్తి నిర్మాణం కాలేదు. కానీ రెండున్నరేళ్ల క్రితం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కుంగిపోయాయి. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిలపడం లేదు.

రూ.72,766 కోట్ల అప్పు చెల్లింపు..
2020 నుంచి 2025 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాల్లో రూ.72,766 కోట్లు చెల్లించారు. గత బీఆర్‌ఎస్‌ చెల్లించిన అప్పులతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం (2023–2025) హయాంలో ఎక్కువ మొత్తం కేటాయించి, చెల్లింపులు వేగవంతం చేసింది. 2025లో ఒక్కసారి రూ.33,574 కోట్లు చెల్లించారు. ఇది 2024తో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఇక 2020–2022లోని వార్షిక చెల్లింపులతో పోల్చితే మూడింతలు ఎక్కువ. ఈ రుణం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ భారంగా మారుతోంది.

Also Read: బండి సంజయ్.. భాగ్యలక్ష్మీ అమ్మవారు.. ఓ విజయ రహస్యం..

భారంగా మారిన వడ్డీ..
ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాల వల్ల వడ్డీలే ప్రధాన సమస్య. 2026 జనవరిలోనే రూ.417 కోట్లు కేవలం వడ్డీలకు వెచ్చించారు, ఇది ప్రతీనెల సగటు రూ.300 నుంచి రూ.400 కోట్ల మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటూ, వడ్డీ భారం తగ్గింపునకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో రుణాల చెల్లింపు జాప్యం కావడంతో వడ్డీ భారం మరింత పెరిగింది. రేవంత్‌రెడ్డి ఆ భారం క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఫలితంగా, రాష్ట్ర ఆదాయాలు ప్రాజెక్టు ప్రయోజనాలకు (సాగునీటి సరఫరా వంటివి) మళ్లీ కేటాయించబడతాయి.

దీర్ఘకాలిక లాభం..
ఈ రుణాలు రాష్ట్ర బడ్జెట్‌పై 10–15% ఒత్తిడి కలిగిస్తున్నాయి, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం వంటి రంగాల నిధులను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌ కట్‌లు, పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఈ సవాలును ఎదుర్కొంటోంది. ఇలా కొనసాగితే రెండు మూడేళ్లలో రుణాలు 50% తగ్గుతాయి. రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు ఆదా అవుతాయి. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందంచడానికి అవకాశం కలుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version