Telangana Cabinet Expansion (1)
Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Also Read: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. కొత్తగా నలుగురికి ఛాన్స్.. రేసులో వీరు..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఉగాది సందర్భంగా ఈ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్(KC. Venugopal) నివాసంలో కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నేతలు హాజరైన ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ(Cabinate Expanshan)పై చర్చలు జరిగాయి. పార్టీ అధిష్ఠానం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపైనా అధిష్ఠానం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కొత్త కేబినెట్‌లో వీరికి ఛాన్స్..
కొత్త మంత్రివర్గంలో రెండు బీసీ, ఒక రెడ్డి, ఒక ముస్లిం, ఒక ఎస్సీ సామాజిక వర్గాలకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ కోటా(BC Quota)లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తుండగా, ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పేరు ప్రముఖంగా ఉంది. రెడ్డి కోటాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మైనారిటీ కోటా(Minariti Quota)లో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్‌కు అవకాశం ఉండగా, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు కూడా చర్చలో ఉంది.
ఇద్దరు ఔట్..
అయితే, ప్రస్తుత మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ(Konda Surekha), జూపల్లి కృష్ణారావును తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. వరుస వివాదాల్లో చిక్కుకున్న కొండా సురేఖ పదవి కోల్పోతారనే చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతోంది. కొత్త మంత్రివర్గ జాబితా మరో రెండు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. ఈ విస్తరణతో రేవంత్ రెడ్డి టీమ్‌లో కొత్త ఊపు వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.
Also Read: బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్!