Telangana Cabinet Expansion
Telangana Cabinet Expansion: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడి ఏడాది గడిచింది. 2023, డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 15 నెలలుగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీంతో ఆశావహులు విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గరపడింది. సోమవారం(మార్చి 24న) ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
Also Read: బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్!
తెలంగాణలో కేబినెట్ విస్తరణ(Cabinate expanshion)కు సమయం ఆసన్నమైంది. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక చొరవ చూపుతోంది. సోమవారం(మార్చి 24న) ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో క్యాబినెట్‌లో నలుగురు కొత్త మంత్రులను చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం ఉందని తెలుస్తోంది.
కొత్తగా వీరికి ఛాన్స్..
కొత్తగా మంత్రులుగా చేరనున్న వారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి. వివేక్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురూ విభిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బీసీ(BC)లకు ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ విధానాన్ని ప్రతిబింబిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడిగా, పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. జి. వివేక్, బీఆర్‌ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతగా, పార్టీకి కొత్త ఊపు తెచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్(Nizamabad) జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాంతీయ సమతుల్యతను సాధించేందుకు ఎంపికయ్యారు.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో 12 మంది మంత్రులు ఉండగా, గరిష్టంగా 18 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఈ విస్తరణతో ఆరు ఖాళీల్లో నాలుగు భర్తీ కానున్నాయి. ఈ చర్చల్లో ప్రాంతీయ, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, గత ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విస్తరణతో పార్టీలో అసంతృప్తిని తగ్గించి, ప్రభుత్వ పనితీరును మరింత బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించనుంది. కొత్త మంత్రుల ఎంపికతో ప్రభుత్వంలో సమతుల్యత, సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించనున్నాయి.