AP BJP
AP BJP: ఏపీలో బిజెపికి( Bhartiya Janata Party) మరో మంత్రి పదవి కేటాయించనున్నారా? ఈ మేరకు సీఎం చంద్రబాబు నుంచి బిజెపి హై కమాండ్ కు సమాచారం అందిందా? కేంద్ర పెద్దల సిఫార్సులకు చంద్రబాబు పెద్ద పీట వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే బిజెపిలో మంత్రి పదవి దక్కించుకునేది ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: ఎంపీ వర్సెస్ మాజీ మంత్రి.. ముదురుతున్న వివాదం!
* మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం
ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. సూపర్ విక్టరీ సాధించాయి. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆపై డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్( deputy CM Pawan) ఉన్నారు. ఇంకోవైపు బిజెపికి ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. అయితే తనకు మరో మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. క్యాబినెట్లో చూస్తే ఒకే ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది. అది నాగబాబుకు ఖాయం అయింది. ఇటీవల ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయం. ఇప్పుడు బిజెపికి ఒక మంత్రి పదవి అనేది ఎలా అనేది ప్రశ్నార్ధకం.
* ఉగాదికి విస్తరణ
అయితే చంద్రబాబు( Chandrababu) ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ చేస్తారన్నది ప్రధాన వార్త. మంత్రిగా పనితీరు బాగా లేని వారిని పక్కన పెడతారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఒకరిని మాత్రమే తొలగిస్తారా? లేకుంటే ఓ నలుగురు ఐదుగురిని తొలగిస్తారా అన్నది చూడాలి. అయితే చంద్రబాబు విస్తరణలో ఎక్కువమందిని తొలగించరు. గతంలో కూడా జరిగింది అదే. ఒకరిద్దరిని మార్చి వారి స్థానంలో సీనియర్లను నియమించేవారు. ఇప్పుడు బిజెపి కోటా కింద అలా చేస్తారని కూడా తెలుస్తోంది. ఖాళీగా ఉన్న స్థానంలో జనసేన అభ్యర్థి నాగబాబును నియమిస్తారు. ఒక మంత్రిని పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో బిజెపి నేతకు చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
* విపరీతమైన పోటీ
అయితే ఈ ఎన్నికల్లో బిజెపి నుంచి 8 మంది శాసనసభ్యులు గెలిచారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి గెలిచిన సత్య కుమార్ కు( Satya Kumar ) మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇంకా ఓ ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో సీనియర్ నేతగా సుజనా చౌదరి ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి సైతం పదవిని ఆశిస్తున్నారు. ఇంకోవైపు విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు నేతల్లో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.