NTV Vs TV9
NTV Vs TV9: మొన్ననే కదా మేము తోపు.. దమ్ముంటే మమ్మల్ని ఆపు అని టీవీ 9 సవాల్ చేసింది. ఎన్టీవీ కి వార్నింగ్ ఇచ్చింది.. మమ్మల్ని మించిన వాడు లేడని డాంబికాలు పలికింది. బంజారాహిల్స్ లో కట్టుకున్న కొత్త ఆఫీసులో వేడుకలు చేసుకుంది. “రుధిరం” దేవి అహో ఓహో అంటూ డ్యాన్స్ చేసింది. రజనీకాంత్ జబ్బలు చరిచింది. మురళీకృష్ణ సవాల్ విసిరాడు. ఇవన్నీ కూడా కొద్దిరోజుల ముచ్చట్లే అయ్యాయి. క్లీన్ అండ్ ప్లెయిన్ కవరేజీ ఇచ్చే ఎన్టీవీని మళ్లీ నెంబర్ వన్ స్థానంలోకి తీసుకొచ్చాయి. తాజాగా వెళ్లడైన బార్క్ రేటింగ్స్ లో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది. ఎప్పటి లాగానే టీవీ9 రెండో స్థానంలోకి వెళ్ళిపోయింది. తీరని శోకాలు, గగ్గోలు పెడుతోంది.
తాజా రేటింగ్స్ ప్రకారం..
ఇక తాజాగా వెళ్ళడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం 66.5 టీఆర్ పీలతో ఎన్టీవీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 58.7 టీ ఆర్ పీ రేటింగ్స్ తో టీవీ9 రెండవ స్థానానికి పడిపోయింది. గతంలో టీవీ9 మొదటి స్థానానికి వచ్చినప్పుడు దానికి ఎన్ టీవీకి కేవలం ఒక పాయింట్ మాత్రమే తేడా ఉంది. అప్పట్లోనే చాలామంది టీవీ9 మళ్లీ రెండవ స్థానానికి పడి పోవడం ఖాయమని చెప్పారు. వారు చెప్పినట్టుగానే టీవీ9 తన స్థానాన్ని ఎన్ టీవీ కి పువ్వుల్లో పెట్టి ఇచ్చింది. ఈసారి ఎన్ టీవీ కి, టీవీ9 కు మధ్య 6 కు పైగా పాయింట్లు తేడా ఉండడం విశేషం. రెండవ స్థానానికి పడిపోయినంత మాత్రాన ఎన్ టీవీ ఢీలా పడలేదు. తన ప్లెయిన్,నీట్ కవరేజీ ని అలాగే కొనసాగించింది. ఫలితంగా కోల్పోయిన మొదటి స్థానాన్ని తిరిగి సాధించింది.
పూలల్లో పెట్టి అప్పగించింది
వాస్తవానికి టీవీ9 గతంలో తన నెంబర్ వన్ ర్యాంకును పదిలంగా పూలల్లో పెట్టి ఎన్ టీవీకి అప్పగించింది. ఒక రకంగా చెప్పాలంటే టీవీ9 తో పోలిస్తే ఎన్ టివి విస్తృతి, నెట్వర్క్ చాలా తక్కువ. అయినప్పటికీ తన ప్లైన్ కవరేజీతో అది టీవీ9 స్థానాన్ని లాగేసుకుంది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత కోల్పోయిన రాజ్యాన్ని టీవీ9 దక్కించుకుంది. ఏకంగా కిరీటాన్ని కొల్లగొట్టినట్టు సంబరాలు చేసుకుంటోంది. ఇప్పుడు ఆ వంతు ఎన్టీవీ కి వచ్చింది. టీవీ9 కార్యాలయంలో లాగా ఆ సంస్థలో ఆ స్థాయిలో సంబరాలు చేయలేదు.. గతంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించినప్పుడు సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు భారీ స్థాయిలోనే జీతాలు పెంచింది. ఈసారి కూడా ఆ స్థాయిలో కాకున్నా మెరుగైన విధంగానే జీతాలు పెంచనున్నట్టు సమాచారం. ఇక ఈ రేటింగ్స్ జాబితాలో మిగతా చానల్స్ వాటికి ఆమడ దూరంలో ఉన్నాయి. టీవీ5 29.7 రేటింగ్స్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. 23.1 రేటింగ్స్ తో వీ6 నాలుగో స్థానంలో ఉంది. 21.5 రేటింగ్స్ తో ఏబీఎన్ ఐదవ స్థానంలో ఉంది. గతంలో హైదరాబాద్ మార్కెట్లో మూడవ స్థానానికి వచ్చిన టి న్యూస్ హఠాత్తుగా ఆరవ స్థానానికి పడిపోయింది. వీటి యాజమాన్యాల కంటే ఎక్కువ సాధన సంపత్తి ఉన్న రామోజీ రావు, జగన్ ఛానెల్స్ 7,8,9 స్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి వీరిద్దరికి చెందిన పేపర్లు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అదే ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వచ్చేసరికి ఇవి అంతగా పెర్ఫార్మన్స్ చూపించలేకపోవడం విశేషం.
హైదరాబాద్ మార్కెట్ లో
ఇక ఒక పాయింట్ తేడాతో గతంలో అగ్రస్థానం కోల్పోయిన ఎన్టీవీ..ఇప్పుడు మళ్లీ మొదటి స్థానం సాధించిన ఆ యాజమాన్యానికి ఇప్పుడు కూడా కొంచెం బాధ ఉండొచ్చు. నెంబర్ వన్ ర్యాంకు వచ్చినప్పటికీ హైదరాబాద్ మార్కెట్లో ఎన్టీవీ చాలా వీక్. దాన్ని ఎవడూ పట్టించుకోడు. ఎన్ టివి హైదరాబాద్ రీజియన్ లో ఐదో ప్లేసులో కొనసాగుతోంది. దానికి అత్యంత సమీపంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉంది. ఈ మధ్య కాలంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇతర పార్టీల చానల్స్ కంటే ముందంజలో ఉండటం విశేషం. ఇక సాక్షి అయితే 9వ ప్లేసు, హెచ్ఎంటీవీకి అత్యంత దగ్గరగా ఉంది. నిజానికి టీవీ9, ఎన్టీవీ, వి6, టీ న్యూస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మినహా హైదరాబాదులో వేరే తెలుగు న్యూస్ ఛానల్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈటీవీ అయితే మరి దారుణం. అసలు అది ఈ జాబితాలోకి రాకపోవడం అత్యంత బాధాకరం. ఇక అర్బన్ పరిధిలో టీవీ9 నెంబర్ వన్, రూరల్ ఏరియాలో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి.
జాతీయస్థాయిలో..
ఇక జాతీయస్థాయి న్యూస్ చానల్స్ విషయానికొస్తే మొన్నటిదాకా నెంబర్ వన్ స్థానం కోసం నానా గడ్డి కరిచినా రిపబ్లిక్ టీవీ రెండవ స్థానంలో కుదురుకుంది. ఇక అంబానీ ఛానల్ నెట్వర్క్ 18 నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తోంది. ఇక దాని మిగతా భాషా చానల్స్ అత్యంత దారుణమైన రేటింగ్స్ నమోదు చేస్తూ డీలా పడుతున్నాయి. ఇక వాటి సైట్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఓటిటి కంటే బూతు తో బొర్లాడుతున్నాయి. ఇక మిగతా చానల్స్ గురించి చెప్పుకోవడం అత్యంత దండగ.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ntv which has reached the number 1 position again tv9 is concerned
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com