Mosagallaku Mosagadu Collections: నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అని చెప్పిన చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. 50 ఏళ్ళ క్రితం సినిమా కదా, ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి ఎవరు చూస్తారులే అని చాలా మంది అనుకున్నారు. కానీ ఒక్కసారి క్లాసిక్ రేంజ్ ని దక్కించుకున్న సినిమాకి ఎన్ని సంవత్సరాలు దాటినా రేంజ్ తగ్గిపోదని ఈ సినిమాకి నిన్న వచ్చిన డీసెంట్ స్థాయి వసూళ్లను చూస్తే అర్థం అవుతుంది.
విడుదలైన ప్రతీ చోట డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను దక్కించుకున్న ఈ సినిమా మొదటి రోజు 30 నుండి 40 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.అయితే ఈ సినిమా తో పాటుగా మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టీజర్ ‘గుంటూరు కారం’ ని కూడా సినిమాకి జత చేసి విడుదల చెయ్యడం తో డీసెంట్ గ్రాస్ రావడానికి కారణం అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా రీ రిలీజ్ వసూళ్లు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లో రీసెంట్ గా విడుదలైన సింహాద్రి కంటే ఎక్కువ ఓపెనింగ్ దక్కించుకుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లోని అత్యంత ప్రసిద్ధి గాంచిన AMB సినిమాస్ లో సింహాద్రి చిత్రం కేవలం లక్ష 50 వేల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. కానీ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం మొదటి రోజు ఈ థియేటర్ లో మూడు లక్షల రూపాయలకు పైగానే గ్రాస్ ని సాధించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇలా ఈ రెండు సినిమాల మధ్య ఇంత తేడా రావడానికి ఒక కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే సింహాద్రి సినిమాకి అతి తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్స్ ఇచ్చారని, కానీ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి పెద్ద కెపాసిటీ ఉన్న థియేటర్స్ ఇచ్చారని, అందుకే గ్రాస్ లో అంత తేడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.