https://oktelugu.com/

Nizam Christmas Challenge: 6 గంటల్లో 60 సూట్లు.. టైలర్‌కు నిజాం ప్రభువు క్రిస్మస్‌ ఛాలెంజ్‌.. లేదంటే..! చరిత్ర దాచిన కథ.

డిసెంబర్‌ 25.. లోక రక్షకుడు ఏసు క్రీస్తు పుట్టిన రోజు. ఆయన సన్మదినం ప్రపంచమంతా పండుగ దినం. ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే పండుగ ఇదే. బుధవారం(డిసెంబర్‌ 25న) ప్రపంచమంతా క్రిస్మస్‌ వేడుకల్లో నిమగ్నమైంది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 26, 2024 / 09:53 AM IST

    Nizam Christmas Challenge

    Follow us on

    Nizam Christmas Challenge: ప్రపంచం అంతా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో క్రిస్మస్‌ ఒకటి. ఏటా డిసెబర్‌ 25న క్రిస్మస్‌ జరుపుకుంటారు. దేశాలు వేరైనా వేడుకలు జరుపుకునే విధానం వేరైనా.. పండుగ మాత్రం క్రీస్తు జననమే. లోక రక్షకుడు అయిన యేసు క్రీస్తు పుట్టిన రోజునే క్రిస్మస్‌ పండుగగా జరుపుకుంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్‌ సంబరాల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా క్రైస్తవులు వేడుకల్లో ఉన్నారు. గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనా మందిరాలను ఒకరోజు ముందే విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అర్ధరాత్రి నుంచే క్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ ప్రార్థనలు, భక్తిగీతాలాపనలు చేశారు. ఇలాంటి తరుణంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతున్న ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణను పాలించిన నిజాం ప్రభువులు.. క్రిస్మస్‌ సందర్భంగా ఓ టైలర్‌కు ఇచ్చిన ఛాలెంజ్‌ అది. ఆ చాలెంజ్‌ ఏంటి ఎందుకు చేశారు అనేదానిపై చర్చ జరుగుతోంది.

    ప్యాలెస్‌కు పిలిపించుకుని..
    1954వ సంవత్సరం డిసెబర్‌ 24న రాత్రి ప్రముఖ టైలర్‌గా గుర్తిపం ఉన్న జాన్‌ బర్టన్‌ను 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన ప్యాలెస్‌కు పిలిపించుకున్నాడు. దుస్తులు అందంగా, ఆకర్షణీయంగా కుట్టడంతో జాన్‌ బర్టన్‌ సిద్ధహస్తుడు. అందుకే అతడిని క్రిస్మస్‌ కోసం సూట్లు కుట్టాలని పిలిపించాడు. క్రిస్మస్‌ కోసం తనతోపాటు తన చుట్టూ ఉండే పరివారానికి సూట్లు కుట్టాలని ఆదేశించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్టు పెట్టారు. మొత్తం 60 మందికి క్రిస్మస్‌ మెయిన్‌ ఈవెంట్‌కు మరో 6 గంటల్లో సూట్లు, ప్యాంట్లు, షర్టులు కుట్టాలని ఆదేశించాడు. ఇది వినగానే బర్టన్‌ షాక్‌ అయ్యాడు. ఇంత తక్కువ సమయంలో కుట్టడం ఎలా అని టెన్షన్‌ పడ్డాడు.

    ఛాలెంజ్‌ స్వీకరించి..
    ఎంత నిష్ణాతుడైనా 6 గంటల్లో 60 సూట్లు కుట్టడం అసాధ్యం. కానీ నిజాం ప్రభువు ఆజ్ఞ మేరకు టైరల్‌ బర్టన్‌ కూడా ఛాలెంజ్‌ స్వీకరించాడు. క్షణం కూడా వృథా కాకుండా నిమిష నిమిషానికి టైం చూసుకుంటూ సూట్‌లు, ప్యాంట్లు, షర్టులు కుట్టడం మొదలు పెట్టాడు. చేతులను యంత్రాలుగా మార్చేశాడు. మెదడును సూపర్‌ కంప్యూటర్‌లా మార్చేశాడు. తన దగ్గర ఉన్న టైలర్లందరీకీ ఒక్కో పని అప్పగించాడు. కొందరు షర్ట్స్, కొందరు ప్యాంట్స్, మరికొందరు సూట్స్‌ కుట్టడం మొదలు పెట్టారు. అన్నీ సరిగ్గా ఉఆన్నయా లేదా, సరిచేయాలా అనేది బర్టన్‌ చూసుకున్నాడు. బట్టలనీన కచ్చితమైన కొతలతలతో అందంగా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకున్నాడు. ఎంత ఒత్తిడి, టైం ప్రెజర్‌ ఉనాన.. గడువులోగా 60 సూట్స్, ప్యాంట్లు, షర్టులు కుట్టి నిజాం ప్రభువుతో షభాష్‌ అనిపించుకున్నాడు. బర్టన్‌ పనితీరు మెచ్చిన నిజాం అరుదైన బహుమతి కూడా అందించాడు.