Nagababu : నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేతపై నాగబాబు ప్రశంసలు..వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్!

మెగా బ్రదర్ నాగబాబు కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ 'వర్షా కాలం లో తుమ్మలు తెగిపోయి, చెరువు నాళాలు ఉప్పొంగి అపార్ట్మెంట్స్ లోకి, వీధుల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

Written By: Vicky, Updated On : September 1, 2024 5:55 pm

Nagababu tweet On N Convention

Follow us on

Nagababu :  అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ద్వారా అనేక అక్రమ కట్టడాలను ఇటీవల కాలంలో కూల్చేసిన ఘటన ఎంతటి సంచలనంగా మారిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. అక్కినేని నాగార్జున కి సంబంధించిన N కన్వెన్షన్ హాల్ ని కూడా కూల్చేశారు. దీనిపై ఆయన ప్రభుత్వం పై విరుచుపడ్డాడు. N కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణం కాదని, పట్టా భూమి లోనే నిర్మించామని, ఒక్క సెంట్ కూడా అక్రమంగా తీసుకోలేదని, అప్పటి ప్రభుత్వం కూల్చివేతలు సిద్ధపడితే హై కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చిందని. ఆ స్టే ఆర్డర్ ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం అన్యాయం గా N కన్వెన్షన్ హాల్ ని కూల్చేయడం బాధాకరం అని, దీనిపై నేను హై కోర్టు లో న్యాయపోరాటం చేస్తాను అంటూ నాగార్జున వేసిన ట్వీట్స్ సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారాయి. నాగార్జున కి సపోర్టుగా ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం.

అయితే దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘వర్షా కాలం లో తుమ్మలు తెగిపోయి, చెరువు నాళాలు ఉప్పొంగి అపార్ట్మెంట్స్ లోకి, వీధుల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలా జరగడానికి కారణం చెరువులు, నాళాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే. ఇప్పుడు అర్థం అవుతుందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న హైడ్రా కాన్సెప్ట్ ప్రాముఖ్యత. ఆయన చేపడుతున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని స్వాగతిద్దాం. చెరువులు ఉండడం అత్యవసరం, పర్యావరణం ని మనం రక్షిస్తే, అది కచ్చితంగా తిరిగి మనల్ని రక్షిస్తుంది, భక్షిస్తే అది కచ్చితంగా మన ప్రాణాలను తీసేస్తుంది. ఇది ప్రతీ ఒక్కరు గుర్తించుకొని, జాగ్రత్తగా మలుచుకోవాలి’ అంటూ నాగబాబు వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఒకపక్క అక్కినేని అభిమానులు సీఎం రేవంత్ రెడ్డి ని ట్యాగ్ చేసి తమ హీరోపై కక్ష్య పూరిత చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తుంటే, మరోపక్క నాగబాబు జనసేన పార్టీ తరుపున ఇలా మాట్లాడడం నాగార్జున అభిమానులకు తీవ్రమైన కోపాన్ని కలిగించింది. చిరంజీవి, నాగార్జున ఎంతో మంచి స్నేహితులు, ఇద్దరు ఒకరిని ఒకరు సొంత సోదరులు లాగా భావిస్తుంటారు. N కన్వెన్షన్ కూల్చివేతపై నాగబాబు అభిప్రాయం ఇదే అయితే, చిరంజీవి అభిప్రాయం కూడా అదే అయ్యుంటుందా?, లేదా ఇద్దరి అభిప్రాయాలూ వేర్వేరుగా ఉండుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే నాగబాబు కి ఏది మాట్లాడాలి అనిపిస్తే అది మాట్లాడేస్తాడు అనేది ఆయనని బాగా పరిశీలించిన వారికి ఈ విషయం అర్థం అవుతుంది. కాబట్టి నాగబాబు వ్యక్తిగత కామెంట్స్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదు అనేది వాస్తవం.