Media Business: అదేదో సినిమాలో వడ్డీ మీద బారువడ్డీ. బారు వడ్డీ మీద చక్రవడ్డీ.. చక్రవడ్డీ మీద విష్ణు చక్రం వడ్డీ.. వసూలు చేస్తా
. ఇది వ్యాపారం అంటుంటారు కదా బ్రహ్మానందం.. ఆ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగానే సుప్రసిద్ధ పాత్రికేయుడు తాను నెలకొల్పిన మీడియా సంస్థ ద్వారా వ్యాపారం చేస్తున్నాడు. వాస్తవానికి అతడు సంస్థలో రిపోర్టర్ గా చేరాడు. అతడిది బలమైన కులం కావడంతో పరిచయాలు విస్తృతంగానే ఏర్పడ్డాయి. బతకనేర్చిన పాత్రికేయుడు కావడంతో భారీగానే వెనకేశాడు. పైగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఏర్పడిన అనూహ్యమైన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఏ పత్రికలో అయితే తన విలేకరిగా పని చేశాడో.. ఆ తర్వాత ఆ సంస్థనే సొంతం చేసుకున్నాడు. చివరికి ఆ సంస్థను అంతకంతకు విస్తరించాడు. నేడు పేపర్, ఛానల్, వెబ్ .. ఇలా విభిన్న రంగాలకు తన మీడియాను విస్తరించాడు. తన మీడియాలో దాదాపు 1200 నుంచి 1400 మంది దాకా ఉపాధి కల్పిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ..ఈ మీడియా ద్వారా అతడు చేస్తున్న వ్యాపారమే ఎవరికీ అంతు పట్టడం లేదు.
Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓపెన్ చాలెంజ్.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ పేరు మార్చుకుంటాడా?
సాధారణంగా ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు నిర్వహిస్తున్న మీడియా సంస్థల్లో పెద్ద తలకాయలకు మినహా మిగతా వారికి చెప్పుకునే స్థాయిలో ఉండవు. కాకపోతే వారు మీడియాలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో మధ్య వయసుకు రావడం.. ఆ వయసులో ప్రయోగాలకు సిద్ధం కాకపోవడంతో చచ్చినట్టు అందులోనే పనిచేస్తున్నారు. ఇక వారితోనే బండెడు చాకిరి చేయిస్తుంటాడు ఆ మీడియా అధిపతి. బయటికి శ్రీరంగనీతులు చాలానే చెబుతుంటాడు. పైగా తాగుతాను విలువలు ఉన్న వట వృక్షం లాగా చెప్పుకుంటాడు. కానీ వాస్తవంలో మాత్రం అలా ఉండదు. ఉద్యోగులను రాచీరంపాన పెట్టి నరకం చూపించడంలో ఆ మీడియా అధినేత తరువాతే ఎవరైనా. మీడియా అధినేత అలా ఉంటే.. ఇక పెద్ద తలకాయలు అంతకుమించి అనేలాగా వ్యవహరిస్తుంటాయి. ఉద్యోగులతో రకరకాల పనులు చేయించుకుంటాయి. ఆ మీడియా అధినేత నిర్వహిస్తున్న పత్రికలో నెట్వర్క్ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. తన కుమార్తె వివాహాన్ని ఆంధ్రప్రదేశ్లో జరిపాడు. ఆ వివాహానికి రెండు రాష్ట్రాలలో పనిచేస్తున్న బ్యూరో చీఫ్ లు హాజరయ్యారు. హాజరుకావడమే కాదు, ఆ పెళ్లికైన ఖర్చులో సగానికంటే ఎక్కువ భరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి.
ఇటీవల ఆ మీడియా అధినేత సరికొత్త ప్రయోగానికి తెర దీశాడు. ఎక్కువ ప్రకటనలు చేసిన మార్కెటింగ్ సిబ్బందికి శ్రీలంకను చూపించే దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. అంటే ఎక్కువ ప్రకటనలు చేసిన వారు విదేశాలకు వెళ్లొచ్చన్నమాట. మూడు విడతలుగా ఉద్యోగులను శ్రీలంక పంపిస్తున్నాడు. ఇప్పటికే ఒక విడత శ్రీలంక వెళ్లి వచ్చారు.. వాస్తవానికి శ్రీలంక వెళ్లి రావడానికి మహా అయితే లక్ష రూపాయల దాకా ఖర్చవుతుంది. మూడు విడతలలో.. మొత్తంగా 15 మందిని మాత్రమే శ్రీలంక తీసుకెళ్తారట. ఈ లెక్కన 15 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. హోటల్లో బస వరకే మేనేజ్మెంట్ బాధ్యత. అక్కడ తిండికే అయ్యే ఖర్చు మొత్తం సిబ్బంది భరించాలి. చివరికి విహారయాత్రలో కూడా పిసినారితనమే. ఇక శ్రీలంక టూర్ తీసుకువెళ్లి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సిబ్బందితో మీటింగ్ పెడతారట. టార్గెట్లు పూర్తి చేసిన వారు ఇలా విహారయాత్రలకు వెళ్లే భాగ్యాన్ని దక్కించుకుంటారని చెబుతారట. కేవలం 15 లక్షలు మాత్రమే ఖర్చుపెట్టి.. కోట్లు దక్కించుకునే పన్నాగం ఇది. దీనినే ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు మీడియా ముసుగులో చేస్తున్న వ్యాపారం అంటారు..