Medchal Police Arrest: ఇటీవల సికింద్రాబాద్లో సృష్టి ఐ వి ఎఫ్ సెంటర్ దందా బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా ఫెర్టిలిటీ సెంటర్ లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో హైదరాబాదు నగరంలో యాచకులు.. ఇతర వ్యక్తుల నుంచి వీర్యం.. కొంతమంది మహిళల నుంచి అక్రమ విధానాలలో అండాలు సేకరిస్తున్న దందా బయటపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఐవీఎఫ్ కేంద్రాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగానే ఓ తల్లీ కొడుకు చేస్తున్న పాడు పని బయటపడింది.
Also Read: గో బ్యాక్ మార్వాడి.. తెలంగాణలో ఎందుకీ ఉద్యమం?
హైదరాబాదులోని మేడ్చల్ ప్రాంతంలో లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి అనే తల్లీ కొడుకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.. మీరు ఒక బహుళ అంతస్తుల భవనంలో సరోగసి దందా చేస్తున్నట్టు తేలింది. వివిధ రాష్ట్రాల చెందిన మహిళలను ఇక్కడికి తీసుకొచ్చారు. వారిని ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేలా చేస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. పిల్లలు లేని ధనవంతుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వీరు ఈ సరోగసి దందాకు పాల్పడుతున్నారు. ఒక్కో సరోగసికి దాదాపు 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరికి హైదరాబాద్ నగరంలోని పలు ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.. పిల్లలు లేని ధనవంతులతో ముందుగానే డీల్ మాట్లాడుకొని.. అడ్వాన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో చెందిన మహిళల వివరాలు వారికి అందిస్తారు. ఇందులో ఆరోగ్యంగా ఉన్న మహిళను ఎంపిక చేసుకొని ఆమెకు ఐవిఎఫ్ ద్వారా గర్భవతిని చేస్తారు.
Also Read: మునుగోడు ఎమ్మెల్యేకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అవసరం లేదట..
నెల తప్పిన నాటి నుంచి మొదలుపెడితే ప్రసరించే వరకు వీరు తమ ఆధ్వర్యంలో ఉంచుకుంటారు. వారికి పౌష్టికాహారం అందిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. గర్భవతులను బయటి ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఒప్పుకోరు. బహుళ అంతస్తులోనే అత్యంత అధునాతన సౌకర్యాలు కల్పిస్తుంటారు.. ఆ తర్వాత పౌష్టికాహారం, మందులు అందిస్తుంటారు. అనంతరం వారు ప్రసవించిన తర్వాత కొద్ది రోజులపాటు పాలు ఇచ్చిన తర్వాత.. అనంతరం బయటికి పంపిస్తుంటారు. ఇటీవల సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. పోలీసుల దృష్టికి లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి వ్యవహారం వచ్చింది.. ఆ తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత వీరిద్దరిని అరెస్ట్ చేశారు.