Medak Teacher: సమయానికి రారు. విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పరు. విధి నిర్వహణ కంటే ఇతర వ్యాపకాలలోనే బిజీగా ఉంటారు. సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే అందరికీ పై అభిప్రాయమే ఉంది. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనైతిక కార్యకాలపాలకు పాల్పడుతున్న ఉదంతాలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి వాటి వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులంటేనే చులకన భావం ఏర్పడుతోంది. అయితే అటువంటి వారికి ఉపాధ్యాయుడు ఒక పాఠం చెబుతున్నారు. ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలో నిరూపిస్తున్నారు.
ఆయన పేరు రవిరాజ్. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆద్మా పూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈయన గణితం బోధిస్తారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో రవిరాజ్ ది భిన్నమైన శైలి. విద్యార్థులు పాఠాలను నేర్చుకోవడంలో వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. బోర్డ్ గేమ్స్, పజిల్స్ అందుబాటులో తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు సులభంగా ఘనతను నేర్చుకుంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పరికరాలను రవిరాజు సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఆయన బోధనకు ఆకర్షితులై ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. గత ఏడాది ఈ పాఠశాలలో 53 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 73 కి చేరుకుంది. గతంలో పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల శాతం 45 గా ఉంటే ఇప్పుడు ఏకంగా 95 శాతానికి చేరుకుంది. ఆయన బోధనకు ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాన్ని ఇటీవల అందించింది.
రవి రాజు కేవలం వినూత్నమైన బోధన మాత్రమే కాదు యూట్యూబ్ ద్వారా కూడా పాఠాలు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో రవిరాజ్ మాస్టర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సులభంగా గణితం బేసిక్స్ అర్థం చేసుకోవడానికి ఆయన తనదైన శైలిలో వీడియోలు రూపొందించారు. ఇప్పటివరకు 1600 వీడియోలను ఆయన రూపొందించారు. ఆయన ఛానల్ ను రెండు మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి.