Asia Cup 2025 India Vs Pakistan: ఆసియా కప్ లో పాకిస్తాన్ సూపర్ 4 లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో యూఏఈ పై విజయం సాధించి అదరగొట్టింది. గెలవాల్సిన మ్యాచ్ లో సమష్టి ప్రదర్శన చేసింది. ఫలితంగా ఆసియా కప్ ఆసియా కప్ వేటలో బలమైన అడుగు వేసింది. తద్వారా సూపర్ 4 లోకి ప్రవేశించి.. భారత జట్టుతో మరోసారి పోటీ పడనుంది.
Also Read: ఐసీసీ ఏ హే పో అనేసింది.. పాకిస్తాన్ కు దిక్కు లేక బిక్క చచ్చింది! ఏం ర్యాగింగ్ రా ఇది!
సెప్టెంబర్ 21 ఆదివారం నాడు భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 పోరు జరగనుంది. గ్రూప్ దశలోనే జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ మీద విజయం సాధించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. యూఏఈ పై ఒకవేళ పాకిస్తాన్ కనుక ఓడిపోయి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. వాస్తవానికి బ్యాటింగ్లో పాకిస్తాన్ విఫలమైనప్పటికీ చివరి దశలో ఆఫ్రిది అదరగొట్టాడు. లేకపోతే పాకిస్తాన్ ఆ మాత్రం స్కోర్ కూడా చేసి ఉండేది కాదు.
గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్, భారత్ సూపర్ 4 కు క్వాలిఫై అయ్యాయి. సూపర్ 4 లో ఒక్కో జట్టు మూడు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4 రేసులో ఉన్నాయి.. శ్రీలంక సూపర్ 4 లోకి వెళ్లడం లాంఛనం అయినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 పోటీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.. భారత్ మినహా మిగతా జట్లు అంచనాలకు మించి రాణించలేకపోవడంతో ఆసియా కప్ అంత జోరుగా సాగడం లేదు. నిర్వాహకులు భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ మిగతా జట్లు విఫలమవుతున్నాయి. ప్రేక్షకులు లేక మైదానాలు ఖాళీగా కనిపిస్తున్నాయంటే వారి ప్రదర్శన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల భారత్ , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు బాయ్ కాట్ నినాదం జోరుగా సాగింది. ఈ మ్యాచ్ బహిష్కరించాలని చాలామంది పిలుపునిచ్చారు. అయినప్పటికీ మ్యాచ్ విజయవంతంగా సాగింది. హోరహోరీగా సాగుతుంది అనుకున్న ఈ మ్యాచ్.. ఏకపక్షంగా మారింది. ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టుపై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంకోసారి పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడొద్దని.. మ్యాచ్ బైకాట్ చేస్తే కనీసం రెండు పాయింట్లు అయినా వస్తాయని.. అప్పటికైనా ఫైనల్ వెళ్లడానికి పాకిస్తాన్ కు అవకాశాలు ఉంటాయని ఆ జట్టు అభిమానులు వ్యాఖ్యానించడం విశేషం.