Manmohan Singh Passed Away: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ గురువారం(డిసెంబర్ 26న) కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న మన్‌మోహన్‌సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న మన్‌మోహన్ సింగ్ మరణించడంతో తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మృతికి సంతాపంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించింది. దీంతో డిసెంబర్ 27న అన్ని విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఈమేరు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వృద్ధాప్య సమస్యలతో..
మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యమస్యలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మోదీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ మరణ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ బెళగావి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రియాంక, సోనియాగాంధీ కూడా ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ మన్‌మోహన్‌సింగ్ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి పరామర్శించారు.
7 రోజులు సంతాప దినాలు..
మన్‌మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం(డిసెంబర్ 27న) కేంద్ర మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మృతికి సంతాపం తెలుపుతుంది.