AUS Vs IND 4th Test(2)
AUS Vs IND 4th Test: భారత జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం అంత సులువు కాదు. ఒకో స్థానానికి విపరితమైన పోటీ ఉంటుంది. అంత పోటీ మధ్య స్థానం సంపాదించుకోవడం.. దానిని నిలబెట్టుకోవడం అంత ఆషామాషి కాదు. ఆ విషయం ఆడుతున్న ఆటగాళ్లకు కూడా తెలుసు.. కానీ మైదానంలోకి వెళ్లిన తర్వాత వాళ్లకు ఏమవుతుందో అర్థం కావడం లేదు.. అతి కష్టం మీద స్థానం సంపాదించిన తర్వాత.. దానిని నిలబెట్టుకోవడం వాళ్లకు కష్టం అవుతుంది. ఈ జాబితాలో ప్రముఖ పాస్ట్ బౌలర్ సిరాజ్ కూడా చేరుతాడేమోనని అనుమానంగా ఉంది.
మహమ్మద్ సిరాజ్ జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. క్రికెట్ ను మాత్రమే శ్వాసగా, ధ్యాసగా పరిగణించాడు. అందుకోసం తన ఇష్టాలను వదులుకున్నాడు. కష్టాలను భరించాడు. చివరికి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. తన విభిన్నమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. పదునైన బంతులు వేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. తన మెరుపు వేగంతో భయాన్ని పరిచయం చేశాడు. దీంతో అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతడేమో పురోగమనం నుంచి తిరోగమనం వైపు ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. ఆకాష్ దీప్ లాంటి బౌలర్ మెరుపులు మెరిపిస్తుంటే.. ఇతడేమో 5.30 ఎకానమీ నమోదు చేసి పరువు తీసుకున్నాడు..
ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు..
అయితే మెయిడ్ ఇన్ ఓవర్లు అయినా వేయాలి.. లేకుంటే వికెట్లైనా పడగొట్టాలి.. టెస్ట్ క్రికెట్లో బౌలర్లు ఇదే సూత్రాన్ని అనుసరిస్తారు.. ఎవరు కూడా భారీగా పరుగులు సమర్పించుకోవాలని అనుకోరు. కానీ మెల్ బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. 22 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు మూడు మాత్రమే మెయిడ్ ఇన్ ఓవర్లు వేశాడు.. 116 పరుగులు సమర్పించుకున్నాడు. 5.30 ఎకానమీతో తన స్థానాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇతడి చెత్త బౌలింగ్ వల్ల టీమ్ ఇండియా సెంటర్లకు షమీ గుర్తుకు రాక తప్పదు. ఎందుకంటే షమీ గాయం వల్ల బౌలింగ్ లైనప్ ఎంత మైనస్లో పడిందో అవగతం అవుతుంది. కొత్త బంతి వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో సిరాజ్ కు అర్థం కావడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో సిరీస్లో అనవసరమైన అగ్రేషన్ తో సిరాజ్ పరువు పోగొట్టుకున్నాడు. షో ఆఫ్ తో నెట్టింట విమర్శలకు గురయ్యాడు. చివరికి స్లెడ్జింగ్ చేసి కూడా చిరాకు తెప్పించుకున్నాడు. బౌలింగ్ పక్కన పెడితే ఫీల్డింగ్ చేయడం కూడా సిరాజ్ కు చేతకావడం లేదు. ఫీల్డింగ్ లో 14 పరుగులు సమర్పించుకున్నాడు. అనవసరమైన షార్ట్ పిచ్ బంతులు వేసి 12 పరుగులు ఇచ్చాడు. ఇక బ్యాటింగ్ లో తక్కువలో తక్కువ పది బంతులను కూడా ఎదుర్కోలేడు. ఓవైపు ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ 49 పరుగులు చేసి అదరగొడుతుంటే.. సిరాజ్ మాత్రం తేలిపోతున్నాడు. షమీ స్థానంలో వచ్చిన సిరాజ్.. తన స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఈ లెక్కన చూస్తే జట్టులో అతడు స్థిరంగా ఆడటం.. స్థిరంగా ఉండడం కష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆకాష్ దీప్ ద్వారా అతడికి ప్రమాదం పొంచి ఉంది. మెల్ బోర్న్ టెస్టులో ఆకాష్ దీప్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ప్రమాదకరమైన స్మిత్ ను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు.