KTR: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈమేరకు ఇప్పటికే రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించింది మూవీ టీం. తాజాగా మూడో ఈవెంట్‌ను సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు భారీగా ఏర్పాట్లు చేయించింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో తమ అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. లాఠీచార్జి చేసినా కట్రోల్ కాలేదు. దీంతో చివరకు మూవీ టీం కార్యక్రమం రద్దు చేసింది. తాజాగా ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ వైఫ్యలమే..
దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని కేటీఆర్ ఆరోపించారు. ఒక సినిమా ఈవెంట్ నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ ఇలా జరుగలేదని పేర్కొన్నారు. ఏ పండుగ వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేశారని తెలిపారు. మొహర్రం, బోనాలు, గణేశ్ ఊరేగింపు, నిమజ్జనాలు, బతుకమ్మ, దసరా ఇలా అన్ని పండుగలను దగ్గరుండి చూసుకునేవారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కనీసం సినిమా ఈవెంట్లు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
హైదరాబాద్ అస్తవ్యస్తం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ట్రాఫిక్ సమస్య అయితే కనీ విని ఎరుగని రీతిలో అధ్వానంగా మారిందన్నారు. ఈ విషయం తన కన్నా ప్రజలకే ఎక్కువ తెలుసన్నారు. హైదరాబాద్‌కు బీఆర్‌ఎస్ ఒక బ్రాండ్ తెచ్చిందని, కాంగ్రెస్ పాలనలో ఆ బ్రాండ్ మొత్తం నాశనమవుతోందని ఆరోపించారు. ఇలా అయితే హైదరాబాద్‌కు కొత్తగా పెట్టుబడులు రాకపోగా, ఇప్పటికే ఏర్పాటు చేసిన కంపెనీలు కూడా తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి – కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024