KTR
KTR : భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. పరిశ్రమలు, పురపాలక, ఐటి శాఖలకు ఆయన మంత్రిగా కొనసాగారు.. హైదరాబాద్ ఐటీ కి దశ దిశ తమ ప్రభుత్వ పరిపాలనలోనే వచ్చిందని కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. టీ హబ్, ఇంకా అనేక సంస్థలు తమ ప్రభుత్వ హయాంలోని ఏర్పడ్డాయని కేటీఆర్ గొప్పలు చెప్పుకునేవారు. తమ అనుకూల మీడియా సంస్థల్లోనూ అదే తీరుగా ప్రచారం చేయించేవారు. అయితే గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క స్థానాన్ని కూడా భారత రాష్ట్ర సమితి గెలుచుకోలేకపోయింది. కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. కెసిఆర్ చేతికర్ర పట్టుకొని ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణలో చెరి 8 చొప్పున కాంగ్రెస్, బిజెపి గెలిచాయి. ఒక్క స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుంది.
Also Read : డీలిమిటేషన్‌పై ఒక్కటైన రేవంత్-కేటీఆర్
కేసు నమోదు..
అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ సోషల్ మీడియాలో, మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయారు. రోజుల వ్యవధిలోనే తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అయితే ఒంటి కాలు మీద లేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కేటీఆర్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు వివాదానికి కారణం అవుతున్నాయి. 2018 లో మిర్చి కి రేటు లేదని ఓ రైతు తన బాధను వ్యక్తం చేయగా.. అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ తర్వాత వాస్తవాలు తెలియడంతో ఆ ట్వీట్ డిలీట్ చేశారు.. ఆమధ్య హైదరాబాద్ నుంచి ఓ కంపెనీ తరలిపోయిందని ట్వీట్ చేసిన కేటీఆర్.. ఆ కంపెనీ బాధ్యులు అలాంటిదేమీ లేదని చెప్పడంతో దాన్ని కూడా డిలీట్ చేశారు. మొత్తంగా సోషల్ మీడియాలోనూ కేటీఆర్ కాంగ్రెస్ అనుకూల నెటిజెన్లకు టార్గెట్ అవుతున్నారు. ఇక తాజాగా కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ వివాదానికి కారణమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై కేసు నమోదు అయింది. ఇటీవల ఈ ప్రాంతంలో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగింది. దానికి పాల్పడిన నిందితులతో మున్సిపల్ చైర్ పర్సన్ చెవుగొని రజిత, ఆమె భర్త శ్రీనివాస్ కు సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ ట్విట్టర్లో ఆరోపించారు. దీంతో రజిత స్పందించారు. తమపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని.. తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతే కాదు తమపై తప్పుడు ట్వీట్ చేసిన కేటీఆర్ పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రజిత, ఆమె భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Also Read : ఇంత ముందుగానా..కేటీఆర్ పాదయాత్ర గేమ్ చేంజర్ అవుతుందా?
నకిరేకల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాస్ కాపింగ్ నిందితులతో సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ, బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు… pic.twitter.com/eGGKj9JoPD
— ChotaNews App (@ChotaNewsApp) March 26, 2025