KCR’s daughter Kavitha to join Congress: తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన ఆయన మొదట్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత టిడిపి తో అంటకాగారు. కొంతకాలానికి బయటకు వచ్చారు. అనేక ప్రతిఘటనలు.. ఎదురుదెబ్బలు తిన్న తర్వాత చివరికి 2014 శాసనసభ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించి చివరికి 2023 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. అధికారం ఉన్నప్పుడు.. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతున్నప్పుడు సహజంగానే విభేదాలు చోటుచేసుకుంటాయి. దీనికి భారత రాష్ట్ర సమితి అతీతం కాదు. కెసిఆర్ లాంటి వ్యక్తి అధినేతగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలకు కొదవలేదు.గతంలో ఈ వ్యవహారాలు ఉన్నప్పటికీ అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. ఎప్పుడైతే కెసిఆర్ కుమార్తె తన తండ్రిని ఉద్దేశించి లెటర్స్ రాశారో.. అవి బయటపడ్డాయో.. అప్పటినుంచి రకరకాల చర్చలు సాగుతున్నాయి. కాకపోతే భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పార్టీ కావడంతో విస్తృతమైన విశ్లేషణలు సాగుతున్నాయి.
Also Read: AP New Pension Update: ఏపీలో పెన్షన్ పంపిణీలో మార్పు.. ఆరోజు ఇవ్వరు!
ఇటీవల కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి అధినాయకత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. కల్వకుంట్ల కవిత ఒకరకంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగారు. అయితే అప్పట్లోనే ఆమె అసంతృప్తి రాగం వినిపించడంతో కెసిఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ లోగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు తెరపైకి రావడం.. ఆ తర్వాత ఆమె అరెస్టు కావడం.. ఆరు నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉండడంతో.. కవిత ఒకరకంగా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ పెద్దలకు కేసీఆర్ టచ్ లోకి వెళ్లారని.. గతంలో కాంగ్రెస్ పార్టీతో కేసిఆర్ వ్యవహరించిన తీరును గమనించిన బిజెపి పెద్దలు దానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇక కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొంతకాలం కుటుంబంతో గడిపారు. ఇటీవల కుమారుడి గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం అమెరికా వెళ్లారు.. ఆమె అమెరికా వెళ్లి తిరిగి ఇండియాకు వస్తారు అనుకుంటున్న ఒకరోజు ముందు ఒక లేఖ మీడియాకు విడుదలైంది. అందులో కేసీఆర్ ను అడుగుతూ కల్వకుంట్ల కవిత సంధించిన ప్రశ్నావళి ఉంది.
Also Read: Sensational news about Kodali Nani’s health: కొడాలి నాని ఆరోగ్యంపై సంచలన విషయం లీక్
ఆ లేఖలు బయటకు రావడంతో కల్వకుంట్ల కవిత ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. తన తండ్రి దేవుడని.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ తదుపరి రోజు భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు విలేకరుల సమావేశం నిర్వహించి.. తన పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని.. కాకపోతే ప్రతి నాయకుడికి ఒక పరిధి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకు కేటీఆర్ కు ఫార్ములా – ఈ రేసులో ఏసిబి నోటీసులు ఇచ్చింది. అయితే వాటిని ప్రశ్నిస్తూ కవిత ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టింది. దీంతో గులాబీ పార్టీలో ఏర్పడిన కోల్డ్ వార్ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ బుధవారం ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో ఒక బొంబాట్ స్టోరీని ప్రచురించింది. కాంగ్రెస్ పార్టీలోకి కవిత చేరుతున్నారని ఆ స్టోరీ ఉద్దేశం. కవిత కాంగ్రెస్లో చేరడానికి పెద్దలతో సంప్రదింపులు జరిపారని.. కాకపోతే దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడ్డుకున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రస్తావించింది.. ” ఆమె చేరిక వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరంగా కుటుంబంలో చిచ్చుపెట్టిన అపఖ్యాతి కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంటుంది. అలాంటి వ్యవహారాలు మంచివి కావు.. ఆమెను పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందికర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని” రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తోంది.. అయితే కవిత ఇప్పటికే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో పార్టీని రిజిస్టర్ చేసుకున్నారని.. తనకు బలమైన పట్టున్న కోల్ బెల్ట్ ఏరియాలలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్నారని సమాచారం.. ఈ లెక్కన చూస్తే కవిత రాజకీయ పార్టీ పెట్టడం లాంచనమేనని ప్రచారం జరుగుతోంది.