Rishabh Pant: కొన్ని రోజులు క్రికెట్ గురించి ఆలోచించడం మానేస్తానని రిషబ్ పంత్ అన్నారు. ఐపీఎల్ సీజన్ త్వరలో ముగియబోతుంది. తర్వాత టీమ్ ఇండియా, ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో నేను కొద్ది రోజులు క్రికెట్ ఆలోచనల నుంచి దూరంగా ఉంటానని రిషబ్ అన్నాడు. తర్వాత ఇంగ్లండ్ తో టెస్ట్ లకు సన్నద్ధమవుతా. ప్రతి మ్యాచ్ లోనూ బాగానే ఆడాలని అనుకుంటాను కానీ అన్ని సార్లూ అలా జరగదని రిషబ్ అన్నాడు. నేను ఇప్పటికీ ఉత్తమ ఆటగాళ్ల నుంచి నిరంతరం నేర్చుకుంటూను ఉంటానని తెలిపాడు.