KCR : తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఫామ్‌హౌస్(Form House)కే పరిమితమయ్యారు. బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అసెంబ్లీకి కూడా రావడం లేదు. కాంగ్రెస్‌కు టైం ఇద్దాం అన్నట్లు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రులు(Graduates), టీచర్స్(Teachers) ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ ఫలితాలు కేసీఆర్(KCR)కు ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో రేవంత్ సర్కార్‌పై వ్యతిరేకత పెరిగిందని గుర్తించి.. దానిని మరింత పెంచేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో బీఆర్‌ఎస్ తరఫున ఇద్దరు అభ్యర్థులను నిలపాలని ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. అభ్యర్థులు ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. సోమవారం అభ్యర్థులను ప్రకటించి బీఫాం అందిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్‌ఎస్(BRS)కు ఒక స్థానానికి సరిపడా బలం మాత్రమే ఉంది. కానీ, కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇద్దరిని బరిలో దించాలని చూస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
Also Read : బీఆర్ఎస్ ను ఓడించడం ప్రజలు చేసిన తప్పట.. ఎన్నికల ఓటముల నుంచి కేసీఆర్ ఇంకా పాఠాలు నేర్వనట్టుంది..
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటా ఇలా..
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. 24 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుంది. బీఆర్‌ఎస్‌కు అధికారికంగా 38 మంది ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత పది మంది అధికార కాంగ్రెస్(Congress)లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ బలం 28కి పడిపోయింది. అధికారికంగా ఉన్న 38 మందిని లెక్కలోకి తీసుకున్నా బీఆర్‌ఎస్ రెండు స్థానాలు గెలవాలంటే మరో పది మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత కోసం కేసీఆర్ రెండో అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారు. ఎన్నికల వేల విప్ జారీ చేస్తారని తెలుస్తోంది.
ఎత్తుగడ ఫలిస్తుందా..
పార్టీ మారిన ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించారని చూపేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. కానీ, కేసీఆర్ ఎత్తుగడ పలించాలంటే ఓపెన్ ఓటింగ్ నిర్వహించాలి. కానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది. దీంతో ఎవరు ఎవరికి ఓటుఉ వేశారని తెలియదు. అయితే పార్టీ మారినవారు ఎవరికి ఓటు వేశాలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా రెండో అభ్యర్థిని బరిలోకి దించుతున్నారని సమాచారం. అయితే కేసీఆర్ ప్రయోగం ఏమేరకు ప్రయనం ఉంటుంది.. కేసీఆర్ మైండ్‌గేమ్ ఆడుతున్నారా అన్నది సోమవారం తెలిసిపోతుంది.
Also Read : గుండెపోటుతో పెంపుడు కుక్క మృతి..బోరున విలపించిన మంత్రి సురేఖ.. వైరల్ వీడియో