Homeజాతీయ వార్తలుVantara Wildlife Centre: అంబానీ వంతరాలో ప్రతిదీ అద్భుతమే.. జంతువులు, వాహనాలు సహా ప్రత్యేకతలు ఎన్నో

Vantara Wildlife Centre: అంబానీ వంతరాలో ప్రతిదీ అద్భుతమే.. జంతువులు, వాహనాలు సహా ప్రత్యేకతలు ఎన్నో

Vantara Wildlife Centre: డబ్బున్న వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. వాళ్లు ఎలాంటి పనులకు శ్రీకారం చుట్టినా అద్భుతంగానే ఉంటుంది. మనదేశంలో ఆగర్భ శ్రీమంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీ.. సేవా కార్యక్రమాలు విరివిగా చేపడుతుంటారు. ముఖ్యంగా ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి మూగ జంతువులు అంటే చాలా ప్రేమ. వాటిని సంరక్షించడం అంటే మరింత ప్రేమ.

Also Read: మహిళా దినోత్సవం : జగన్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడుగా..!

అనంత్ అంబానీ అంటే ముఖేష్ అంబానికి చాలా ఇష్టం. అందువల్లే అనంత్ అడిగిన కోరికను కాదనలేకపోయాడు. మూగజీవాల కోసం గుజరాత్ లో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంతారా పేరుతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కేంద్రంలో ప్రపంచంలోని విభిన్నమైన జంతువులు ఉంటాయి. సింహం నుంచి మొదలు పెడితే పులి వరకు ఇక్కడ సంరక్షణ పొందుతుంటాయి. అందువల్లే వంతారా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల సందర్శించారు. అక్కడ ఉన్న జంతువులను ఆయన పరిశీలించారు. సింహం, పులి వంటి జంతువులతో ఆయన ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు.. అరుదైన జంతువులను.. కాలగర్భంలో కలిసిపోతున్న జంతువులను సంరక్షించడంలో వంతారా కీలకపాత్ర పోషిస్తున్నది. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంతారా కేంద్రాన్ని సందర్శించారు. ఇంత గొప్ప పని చేస్తున్న ముఖేష్ అంబానీని అభినందించారు. వంతారా కేంద్రం బాగుందని.. నిర్వహణ అద్భుతంగా ఉందని ముఖేష్ అంబానీపై ప్రశంసల జల్లు కురిపించారు.

అంత ఖరీదు

సాధారణంగా జూ సఫారిలో అంతగా విలువైన వాహనాలను వాడరు. కాకపోతే ఆ వాహనాలు పూర్తిస్థాయిలో కండిషన్లో ఉండాలి. ఏమాత్రం కండిషన్ తప్పినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్లే జూలో సఫారీ కి వెళ్లే వాహనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తారు. ఇంధనం నుంచి మొదలు పెడితే బ్రేకుల వరకు ప్రతి విషయంలోనూ స్పష్టతను పాటిస్తారు. అయితే ప్రస్తుతం వంతార కేంద్రంలో జూ సఫారీ కి ఏకంగా రెండు కోట్ల విలువైన కారును వాడుతున్నారు. వాస్తవానికి జూ లలో సఫారీగా బొలెరో కంపెనీకి చెందిన వాహనాలను ఉపయోగిస్తుంటారు. ఇక వంతారా లో ఉన్న సఫారీ వాహనం విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందట. సఫారీ వాహనంగా రెండు కోట్ల విలువైన డిపెండర్ కారు.. 25 లక్షల విలువైన ఇసుజు వీ క్రాస్ కారును ఉపయోగిస్తున్నారు. ఇటీవల వీటి మీదే ప్రధాని నరేంద్ర మోడీ సఫారీ చేశారు. ఇందులో భాగంగా జూలో ఉన్న అరుదైన జంతువులను సందర్శించారు. దానికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు.. అయితే సఫారీ వాహనం కోసం అంబానీ కుటుంబం అన్ని కోట్లు ఖర్చుపెట్టడం సంచలనంగా మారింది.. అయితే కొంతమంది సఫారీ వాహనం కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని విమర్శిస్తున్నారు. అంబానీ కుటుంబానికి డబ్బు ఎక్కువైందని వాపోతున్నారు. జంతువులను సంరక్షించడం మంచిదే అయినప్పటికీ.. దానిని కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular