HomeతెలంగాణKavitha: నాకు టైమ్‌ వస్తుంది, దేవుడి దయవల్ల ముఖ్యమంత్రి అవుతా.. కవిత సంచలనం

Kavitha: నాకు టైమ్‌ వస్తుంది, దేవుడి దయవల్ల ముఖ్యమంత్రి అవుతా.. కవిత సంచలనం

Kavitha: కల్వకుంట్ల కవిత.. భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేత.. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో కీలక నిదింతురాలు. కొన్ని నెలల క్రితం సొంత పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి పేరుతో సొంతంగా జనంలోకి వెళ్తున్నారు. జనం బాట పేరుతో జిల్లాలు పర్యటించారు. కానీ.. జనం పెద్దగా ఆదరించలేదు. జనం బాటలో బీఆర్‌ఎస్‌ నేతలు, మాజీ మంత్రులను టార్గెట్‌ చేశారు. ఇక ఇప్పుడు పార్టీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌–కవిత మధ్య యుద్ధం మరింత ముదిరింది.

ఇష్టానుసారం ఆరోపణలు..
కవిత నం బాటలో ఇష్టారాజ్యంగా బీఆర్‌ఎస్‌ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వారు కూడా కవితపై విమర్శలు చేశారు. కొందరు అయతే కేసీఆర్‌ కూతురు అని కూడా చూడకుండా తీవ్రపదాలతో విమర్శలు చేశారు. దీంతో కవిత ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన భర్తను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసిన నేతలకు లీగల్‌ నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. కవిత చేసిన ఆరోపణలపై కూడా బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టించారు. దీంతో కవిత తనకూ టైం వస్తుందని అప్పుటు 2014 నుంచి జరిగిన అక్రమాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు.

దేవుడి దయతో ముఖ్యమంత్రి అవుతా..
దేవుడి దయతో తనకు అవకాశం వస్తుందని తాను కూడా సీఎం అవుతానని కవిత తనకు ముఖ్యమంత్రి సీటుపై ఉన్న ఆసక్తిని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు జరిగిన అవినీతి గురించి మాట్లాడకపోవడానికి కారణాలు కూడా వెల్లడించారు. నవ్వేటోని ముందట బోల్తా పడకూడదన్న ఉద్దేశంతో అప్పుడు అక్రమాల గురించి తెలిసినా మాట్లాడలేదని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన ఆర్థిక గోల్మాల్‌లు, అధికార దుర్వినియోగాలు ప్రజల్లో అసంతృప్తి కలిగించాయన్నారు.

ప్రత్యర్థుల్లో ఆందోళన…
కవిత ప్రకటనతో గులాబీ నేతల్లో గుబులు మందలైంది. పార్టీలో జరిగిన అక్రమాలను దగ్గర నుంచి చూసిన కవిత.. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో, ఎవరి గుట్టు బయట పెడుతుందో అని భయపడుతున్నారు. దీంతో కవిత ఆరోపణలు సీరియస్‌గా తీసుకోవాలని, కవిత నోరు మూయించేలా అధినేతతో మాట్లాడాలని భావిస్తున్నారు. ఈమేరకు కొందరు నాయకులు కేటీఆర్‌ దృష్టికి కవిత ఆరోపణలు తీసుకెళ్లారు. .

కవిత దూకుడుకు వీలైనంత త్వరగా చెక్‌ పెట్టాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో కవిత కూడా బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా ప్రజలకు వివరించాలని చూస్తున్నారు. మరి ఎవరు పైచేసి సాధిస్తారో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular