Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Saves Geetha Singh: లోయలో పడిపోతున్న హీరోయిన్ ని కాపాడిన రవితేజ.. సంచలనం...

Ravi Teja Saves Geetha Singh: లోయలో పడిపోతున్న హీరోయిన్ ని కాపాడిన రవితేజ.. సంచలనం రేపుతున్న వీడియో!

Ravi Teja Saves Geetha Singh: మాస్ మహారాజ రవితేజ షూటింగ్ స్పాట్ లో ఎంత అలెర్ట్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనతో పని చేసిన ప్రతీ ఆర్టిస్టు , రవితేజ షూటింగ్ స్పాట్ లో ఉంటే ఆ ఎనర్జీ నే వేరు అని అంటుంటారు. తనతో పాటు తోటి ఆర్టిస్టులను కూడా హుషారుగా ఉంచుతూ , పని చేయిస్తూ ఉంటాడు. అయితే ‘కితకితలు ‘ హీరోయిన్ గీతా సింగ్ రవితేజ తో పని […]

Ravi Teja Saves Geetha Singh: మాస్ మహారాజ రవితేజ షూటింగ్ స్పాట్ లో ఎంత అలెర్ట్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనతో పని చేసిన ప్రతీ ఆర్టిస్టు , రవితేజ షూటింగ్ స్పాట్ లో ఉంటే ఆ ఎనర్జీ నే వేరు అని అంటుంటారు. తనతో పాటు తోటి ఆర్టిస్టులను కూడా హుషారుగా ఉంచుతూ , పని చేయిస్తూ ఉంటాడు. అయితే ‘కితకితలు ‘ హీరోయిన్ గీతా సింగ్ రవితేజ తో పని చేసిన అనుభవం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రవితేజ , గుణ శేఖర్ కాంబినేషన్ లో వై వీ ఎస్ చౌదరి నిర్మాతగా గతంలో ‘నిప్పు’ అనే చిత్రం తెరకెక్కింది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

ఈ సినిమాలో గీతా సింగ్ ఒక కీలక పాత్ర పోషించింది. ఒక షాట్ లో ఆమె లోయలో పడిపోయే పరిస్థితి వచ్చిందట, అప్పుడు రవితేజ తనని కాపాడదని, ఆరోజు ఆయన అలెర్ట్ గా లేకుండా, నన్ను పెట్టుకోక పోయుంటే నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చునేదానిని కాదంటూ చెప్పుకొచ్చింది. రవితేజ అంటే నాకు మొదటి నుండి క్రష్ అని, షూటింగ్ లో ఆయన అందరితో సమానంగా ఉండేవాడని, చాలా ఫ్రెండ్లీ స్వభావం ఉన్న మనిషి అంటూ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడిన మాటలను ఈ ఆర్టికల్ చివర్లో వీడియో గా అందిస్తున్నాము చూడండి. ఇక రవితేజ ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే, ఆశించిన స్థాయిలో సాగడం లేదనే చెప్పాలి. వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్న ఆయన , మార్కెట్ ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

అయితే ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ తో కలిసి చేస్తున్న ‘ఇరుముడి’మూవీ పై మాత్రం అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. నిన్నుకోరి, మజిలీ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ కావడం , పైగా రవితేజ ని ఎలాంటి రోల్స్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో, అలాంటి రోల్ లోనే ఆయన ఫస్ట్ లుక్ ద్వారా కనిపించడంతో ఫ్యాన్స్ కచ్చితంగా ఈ సినిమాతో ఆయన భారీ కం బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నారు. ఈ ఏడాది లోనే ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని థియేటర్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత అంచనాలను క్రియేట్ చేస్తుంది అనేది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper