Srikanth Odela: ‘దసర’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ‘శ్రీకాంత్ ఓదెల’ ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన పాన్ ఇండియాలో సైతం స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
వింటేజ్ మోహన్ బాబుని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అంటూ శ్రీకాంత్ ఓదెల అండ్ టీం అయితే చెబుతున్నారు. మోహన్ బాబు ఈ మూవీ లో రెండు గెటపుల్లో కనిపించబోతున్నాడు. ఒకటి యంగ్ గెటప్ కాగా, ఇంకోటి ఓల్డ్ గెటప్ కావడం విశేషం…ఇక ఈ రెండు క్యారెక్టర్లతో ఆయన ఎలా మెప్పిస్తాడు ప్రేక్షకులను ఎలా అలరిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక శ్రీకాంత్ ఓదెల మోహన్ బాబుని కలిసిన ప్రతిసారి మంచు విష్ణు అయితే శ్రీకాంత్ ఓదెల ను కలుస్తున్నారట. శ్రీకాంత్ టాలెంట్ గురించి తెలుసుకున్న విష్ణు మోహన్ బాబు సూపర్ హిట్ సినిమా అయిన అసెంబ్లీ రౌడీని శ్రీకాంత్ ఓదెలతో ఎప్పటికైనా సరే రీమేక్ చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక శ్రీకాంత్ ఓదెల సైతం ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలను చేయాలని చూస్తున్నాడు.
కాబట్టి తను మంచు విష్ణు తో సినిమా చేసే అవకాశం ఉందా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి… ఇక శ్రీకాంత్ మొత్తానికైతే మంచు విష్ణు తో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదంటే అతన్ని పక్కన పెట్టి స్టార్ హీరోల వైపే తన చూపు కొనసాగిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్యారడైజ్ మూవీ మీద భారీ బజ్ ఉంది. ఆగస్టు 21వ తేదీ ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు…
