Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బెయిల్ వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లు మరుగున పడిపోయిన తెలంగాణ జాగృతిని అలియాస్ భారత జాగృతిని చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. బీసీ హక్కులపై ఉద్యమాలు చేస్తున్నామని చెబుతూనే.. భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
Also Read: జీవి రెడ్డి ఎపిసోడ్ కు పోసాని అరెస్టుతో చెక్
దుబాయ్ లో కేదార్ అనే వ్యక్తి చనిపోవడం.. దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడటంతో.. ఆంధ్రజ్యోతి పత్రిక మిస్టరీ మరణాలు అనే శీర్షికన.. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ బ్యానర్ వార్త ప్రచురించింది. ఈనాడు రేవంత్ వ్యాఖ్యలకు ప్రయారిటీ ఇచ్చినప్పటికీ.. ఈ కోణంలో వార్తను ప్రజెంట్ చేయలేదు. సహజంగా ఆంధ్రజ్యోతి గురించి తెలిసిందే కదా.. ఇప్పుడు కేసీఆర్ తో చెడింది కాబట్టి వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం సమయం దొరికినా.. చిన్న విషయం తెలిసినా చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇటీవల కొత్త పలుకులో కెసిఆర్ పై రాధాకృష్ణ తన స్టైల్లో విరుచుకుపడ్డాడు. కెసిఆర్ స్వీయ తప్పులు చేశాడని
.. ఇప్పుడేమో అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని రాసుకొచ్చాడు. ఇక గతంలో ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించగానే.. తెలుగులో ఆంధ్రజ్యోతి పత్రికే ముందు వార్త రాసింది. దానిపై అప్పట్లో కవిత మండిపడింది. ఇక నమస్తే తెలంగాణ అయితే శరభ శరభానుకుంటూ ఆంధ్రజ్యోతి మీద ఒంటి కాలు మీద లేచింది. ఏకంగా పేజీలకు పేజీలు కథనాలు కుమ్మి పడేసింది.
కవిత ఆగ్రహం అదే..
నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రజ్యోతి బ్యానర్ స్థాయి ప్రయారిటీ ఇవ్వడంతో.. అది ఎమ్మెల్సీ కవితకు కోపం తెప్పించింది. ఎవడో ఎక్కడో చస్తే.. దానిని భారత రాష్ట్ర సమితికి ఎలా ఆపాదిస్తారు? రేవంత్ రెడ్డి పిచ్చాపాటి గా మాట్లాడితే దానిని బ్యానర్ వార్త ఎలా చేస్తారు? అసలు శీర్షిక ఎలా పెడతారు? అని కవిత విమర్శించింది. అంటే నమస్తే తెలంగాణ మాదిరిగానే ఆంధ్రజ్యోతి ఉండాలా? నమస్తే తెలంగాణలో వచ్చినట్టుగానే ఆంధ్రజ్యోతిలోనూ శీర్షికలు రావాలా? కవిత అలానే కోరుకుంటున్నదేమో.. ఆ మధ్య ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పుడు ఆంధ్రజ్యోతి ముందుగా వార్త రాసింది. కవిత అరెస్ట్ ఖాయమని స్పష్టం చేసింది. దీనిపై కవిత మండిపడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ కవితకు మరింత మైనస్ అయింది. ఆ తర్వాత కొద్ది నెలలకే కవిత అరెస్టు అయింది. నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. నాడు తనను మద్యం కుంభకోణం కేసులో ఉన్నానని రాసిన ఆంధ్రజ్యోతిపై ఇప్పటికి కవిత ఆగ్రహం గానే ఉంది. అందుకే తన కోపాన్ని ఇవాళ ఈరోజు ఈ తీరుగా ప్రదర్శించింది. మరి దీనిపై రాధాకృష్ణ రేపు ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.
Also Read:పోసాని అరెస్ట్.. రంగంలోకి జగన్.. ప్రచార అస్త్రంగా ఆ సామాజిక వర్గం
రేవంత్ రెడ్డి మోడీని కలిసిన వెంటనే పాత్రికేయులతో చిట్ చాట్ లో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఆధారాలు లేకుండా వార్తలు ఎలా రాస్తారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత.#NarendraModi#Revanthreddy#mlckavitha #BRS #Telangana #AndhraJyothi pic.twitter.com/HwfixjMgoV
— Anabothula Bhaskar (@AnabothulaB) February 27, 2025