Kavitha Allegations On KTR: తన తండ్రికిగత 25 సంవత్సరాలుగా లెటర్స్ రాస్తున్నానని.. ఆయన వాటిని చదివి చించి పారేస్తారని.. కానీ ఈసారి ఎవరో ఆ లెటర్స్ బయటకు లీక్ చేశారని గులాబీ అధిపతి కుమార్తె చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను బ్రేకింగ్ న్యూస్ కింద కొన్ని న్యూస్ చానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి. అయితే కవిత ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా? అనే విషయాలను పరిశీలించేందుకు.. ఆమె ఒరిజినల్ సోషల్ మీడియా అకౌంట్స్ చూడగా.. అందులో ఎటువంటి విషయాలు లేవు. అయితే కొన్ని చానల్స్ మాత్రం గులాబీ సుప్రీం డాటర్ వ్యాఖ్యలు చేశారన్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాయి.. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో నెంబర్ :2 గా కొనసాగుతున్న తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావును ఉద్దేశించి గులాబీ సుప్రీం కూతురు విమర్శలు చేశారని కొన్ని న్యూస్ చానల్స్ బ్రేకింగ్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి..
” పార్టీలో నాకు కేసీఆర్ తప్ప ఇంకెవరు నాయకుడు లేడు. కెసిఆర్ లాగే నేను కూడా తిక్కల దాన్ని. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాలుగా నా తండ్రి కి నేను లేఖలు రాస్తున్నాను. వాటిని ఆయన చదివి చించి పారేస్తారు. కానీ ఈసారి నేను రాసిన లేఖలను కేవలం కావాలని బయటికి విడుదల చేశారు.. నాకు ఒక విషయం చెప్పాలి. పార్టీలో ఉన్న వ్యక్తులలో ఎవరు ఆ లేఖను బయటికి బహిర్గతం చేశారు. ఆ విషయం నాకు తెలియాలి. ఆ వ్యక్తి ఎవరో బయటపడాలి. నా లెటర్ బయట పెట్టింది ఎవరో చెప్పాలని అడిగితే.. లీకు వీరులు ఎవరో చెప్పాలని అడిగితే.. గ్రీకువీరులు బయటికి వచ్చారు. కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఆకారణంగా లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేశారు. ఆ సమయంలోనే పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పాను. ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశాను. నాడు దీనికి గులాబీ సుప్రీం ఒప్పుకోలేదు. నన్ను ఇబ్బంది పెట్టడానికి నిన్ను అరెస్ట్ చేశారని ఆయన నాతో వ్యాఖ్యానించారు. ఇంటి ఆడబిడ్డను ఇలా ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రచారం చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటి? భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలో కలపడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుట్రలు వేగంగా సాగిపోతున్నాయని” కవిత వ్యాఖ్యానించినట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి.
కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ సెంటర్ పాయింట్ గా తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలోకి గులాబీ సుప్రీం కూతురు వెళ్లిపోతారని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. దీనికి పింక్ పార్టీ నుంచి ఎటువంటి కౌంటర్ రావడం లేదు. అయితే స్వయంగా గులాబీ బాస్ డాటర్ కౌంటర్ ఇస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో గులాబీ సుప్రీం కూతురికి సంబంధించిన న్యూస్ సెన్సేషనల్ అవుతున్నాయి. మరి దీనిపై గులాబీ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.