Kannepalli Pump House Row: కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి. లక్షల మంది కర్షకులతో కేసీఆర్ కదన రంగంలోకి దూకుతారు. రైతులు స్వయంగా మోటార్లు ఆన్ చేసుకుంటారు. నీళ్లు ఎత్తిపోసుకుంటారు” ఇవీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు. నిజానికి ఆ మోటర్లు ఆన్ చేయడానికి లక్ష మంది దేనికి? ఎలాగూ అనుకూలమైన యూట్యూబ్ సో కాల్డ్ జర్నలిస్టులు ఉన్నారు. ఆస్థాన మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు.. వారితో పాటు కేసీఆర్, హరీష్ రావు వెళ్తే సరిపోతుంది.. అలాంటప్పుడు ఈ హెచ్చరిక లు ఎందుకు చేస్తున్నారు.. ఇదే ఇప్పుడు తెలంగాణ సమాజంలో రెండు రోజులుగా జరుగుతున్న చర్చ..
Also Read: ఆ వైసీపీ నేత ఫుల్ సైలెన్స్.. తేల్చుకోలేకపోతున్న జగన్!
ప్రస్తుతం కాలేశ్వరంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. చాలామంది అధికారులు, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విచారణకు కేసిఆర్ హాజరయ్యారు. దీంతో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సమాజంలో విపరీతంగా చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ కథను డైవర్ట్ చేయడానికి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందనే గత్తర లేపి.. జనం కళ్ళకు గంతలు కట్టే స్ట్రాటజీకి తెర లేపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చాలా రోజులుగా కేసీఆర్ ప్రజా జీవితంలో లేరు. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. అలాంటి వ్యక్తి స్వయంగా కదనంలోకి వస్తారంటే జనం ఎలా నమ్ముతారు. దీనివల్ల భారత రాష్ట్ర సమితికి ప్రచారం వస్తుంది. ఆస్థాన మీడియాకు కొద్దిరోజులు ఉండడానికి సార్ కు దొరుకుతుంది. కానీ దీనివల్ల గులాబీ పార్టీకే భారీ నష్టం.
ఆర్థిక శాఖ మాజీ మంత్రి లక్ష మందితో వెళ్లి ఆన్ చేస్తా అని చెబుతున్న కన్నెపల్లి పంప్ హౌస్ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్లో పూర్తిగా నీట మునిగిపోయింది. అసలు అక్కడ పంప్ హౌస్ కట్టడమే పెద్ద తప్పు. 29 బాహుబలి మోటార్లు, కంట్రోల్ ప్యానెల్స్ ఆరోజు నీట మునిగిపోయాయి. వాస్తవానికి ఆస్థాన మీడియాలో కన్నెపల్లి పంప్ హౌస్ మీద పేజీలకు పేజీలు వార్తలు కుమ్మి పడేశారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ డేంజర్ లో ఉంది..
మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల ప్రమాదంలో ఉన్న దుస్థితి.. ఇవన్నీ కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ఘనతలు. ఇప్పుడు హరీష్ రావు చెబుతున్నట్టుగా ఆ పంపులు ఒకవేళ ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? వాస్తవానికి నీట మునిగిన పంప్ హౌస్ లకు మరమ్మతులు ఎలా చేయాలో కేంద్ర సంస్థలకు అర్థం కావడం లేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి ఎల్లంపెల్లికి పంపించారు. మళ్లీ 45 టీఎంసీల వరకు నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేశారు. అనాలోచితంగా నీటిని లిఫ్ట్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని ఆ ఉదంతం స్పష్టం చేసింది.
వాస్తవానికి నీటిని లిఫ్ట్ చేయడానికి, ఎలా వాడాలో చెప్పడానికి ప్రతి పథకానికి నీటి సామర్థ్యం, విడుదల వంటి ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రాజెక్టు రక్షణ వంటి లెక్కలు కూడా ఉంటాయి. కన్నెపల్లి మాత్రమే కాదు హరీష్ రావు చెబుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పటికే ఈ లిఫ్టుకు సంబంధించిన మోటర్లను జూలై చివర లేదా ఆగస్టులో ఆన్ చేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.
ఇంతగాయి గాయి చేస్తున్న హరీష్ రావు ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయారు… కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం ఎందుకు పెద్దగా మారిందో.. కృష్ణా నీటిని ఇష్టానుసారంగా ఎవరి సహాయంతో ఏపీ ప్రభుత్వాలు వాడుకున్నాయో కూడా హరీష్ రావు చెబితే తెలంగాణ సమాజానికి మరింత బాగా అర్థమయ్యేది.
కాళేశ్వరం నుండి ఎత్తిపోతల షురూ.
Due to rains in upper regions of Pranahitha there’s 59,500 cusecs flow at Medigadda barrage.
Pumping has started from 1,2,5,7 motors at Kannepalli pump house.
Medigadda water levels.
15/06/21- 3.8 TMC
16/06/21- 7.25 TMC@KTRTRS pic.twitter.com/wPK5OJ87oB— Varun Thakkallapalli (@VarunBRS58) June 17, 2021