Homeఎంటర్టైన్మెంట్MM Keeravani Father passes away: కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో రాజమౌళి

MM Keeravani Father passes away: కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో రాజమౌళి

MM Keeravani Father passes away: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(MM KEERAVANI) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. 92 ఏళ్ల శివశక్తి దత్తా మణికొండలో నివాసం ఉంటుండగా, అక్కడే సోమవారం తుదిశ్వాస విడిచారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి(RAJAMOULI)కి శివశక్తి దత్తా(SIVA SHAKTHI DUTTA) వరసకు పెదనాన్న అవుతారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కి స్వయానా సోదరుడు. శివశక్తి దత్త స్క్రీన్ రైటర్ గా , లిరిసిస్ట్ గా పరిశ్రమలో రాణించారు.

శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమండ్రి సమీపంలో గల కొవ్వూరులో జన్మించాడు. బాల్యం నుండి కళల పట్ల మక్కువ ఉండేది. దాంతో ఇంటి నుండి పారిపోయి ముంబైలో ఒక ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండేళ్ల అనంతరం కొవ్వూరు తిరిగి వచ్చి కొన్నాళ్ళు చిత్రకారుడిగా పని చేశాడు. సంగీతంలో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది. సితార్, హార్మోనియం, గిటార్ నేర్చుకున్నారు.

Also Read: రీమేక్ పై అక్కినేని నాగార్జున మొగ్గు..100వ సినిమా గురించి సెన్సేషనల్ న్యూస్!

అప్పటికే మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాల్లో ఉన్న విజయేంద్ర ప్రసాద్ వద్దకు వెళ్లారు. వీరిద్దరూ కలిసి పని చేశారు. నాగార్జున-విజయశాంతి కాంబోలో వచ్చిన జానకి రాముడు వీరికి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకు స్క్రీన్ రైటర్ గా శివశక్తి దత్తా పని చేశారు. బాహుబలి చిత్రంలోని మమతల తల్లీ, ధీవర సాంగ్స్ ని శివ శక్తి దత్తా రచించారు. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు కూడా ఆయన లిరిసిస్ట్ గా పని చేయడం విశేషం. ఛత్రపతి, సై తో పాటు మరికొన్ని చిత్రాలు పాటలు అందించారు.

Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన శేఖర్ కమ్ముల ‘కుబేర’..ఎందులో చూడాలంటే!

శివశక్తి దత్తకు ముగ్గురు పిల్లలు సంతానం. కీరవాణి పెద్దవాడు కాగా కళ్యాణి మాలిక్, శివశ్రీ కంచి ఆయన మిగతా ఇద్దరు కుమారులు. శివశక్తి దత్త మరణంతో రాజమౌళి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్ర ప్రముఖులు శివశక్తి దత్త మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular