Kalyana Lakshmi scheme misuse: ఉచిత పథకాల కోసం ప్రజలు ఎంతగా దిగజారుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఉచితాల వల వేస్తున్నాయి. వాటి వెనుక ఉన్న మోసాన్ని గ్రహించక ప్రజలు.. ఉచితాలను ఇష్టపడుతున్నారు. అర్హత లేకపోయినప్పటికీ పలు పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ ఉచిత పథకాలకు ప్రభుత్వాలు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాయి? అయితే ప్రభుత్వ భూములు అమ్మడం లేదా పన్నులు పెంచడం.. ఇవి రెండూ సాధ్యం కాకపోతే అభివృద్ధి పనుల్లో కోత విధిస్తాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే.. తడిసి మోపెడైన అప్పుల వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. స్వయంగా ముఖ్యమంత్రి నన్ను కోసుకొని తిన్నా రూపాయి లేదని అన్నారంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దివాలా అంచులో ఉంది.
Also Read: సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే.?
ఉచిత పథకాలను వాస్తవానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఇస్తే బాగుంటుంది. కానీ ఓట్లు దండుకోవడానికి రాజకీయ పార్టీలు అందరికీ పథకాలు ఇస్తామని చెప్పడంతో.. అనర్హులు కూడా ప్రభుత్వ లబ్ధిని పొందుతున్నారు. అందుకు బలమైన ఉదాహరణ ఈ సంఘటన. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇది కాస్త శాసనమండలి లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పడం ద్వారా బయటపడింది. ఆయన చెప్పిన వివరాలు చూస్తే నిజంగా ఉచిత పథకాల కోసం ప్రజలు ఎంతగా దిగజారి పోతున్నారో అర్థమవుతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 సంవత్సరాల వృద్ధురాలికి పెళ్లి చేశారు. వాస్తవానికి ఆ వయసులో పెళ్లి చేయడం అనేది ఒక రకంగా ఏవగింపు కలిగించే విషయం. కానీ, కళ్యాణ లక్ష్మి పథకంలో డబ్బుల కోసం 70 సంవత్సరాల వృద్ధురాలికి పెళ్లి చేశారు. పెళ్లి చేయడమే కాదు, కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు కూడా చేశారు. అధికారులకు అంతో ఇంతో లంచమిచ్చి చెక్కు మంజూరు చేయించుకున్నారు. దర్జాగా ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కు కూడా తీసుకున్నారు.
Also Read: రాజాసాబ్ లో ప్రభాస్ ను మోసం చేసే హీరోయిన్ ఎవరంటే..?
కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఒక లక్ష 16 వేల రూపాయలను నూతన వధువుకు అందిస్తూ ఉంటుంది. పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తె తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ సహాయం ఆసరాగా ఉంటుందని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ పథకాన్ని దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు అందించాలని మొదట్లో అనుకున్నారు. కానీ ఆ తర్వాత దీనిని కూడా ఓట్లు దండుకునే పథకంలాగా మార్చారు. చివరికి ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికీ ఆర్థికంగా సహాయం చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది.
70 సంవత్సరాల వృద్ధురాలు కూడా పెళ్లి చేసుకొని.. కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం దరఖాస్తు చేసుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వెనిజులా సంక నాకిపోయింది. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు ఆర్థికంగా నరకం చూస్తున్నాయి. ఇక మిగతా దేశాల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. అటువంటి పరిణామాలను చూసి కూడా మనదేశంలో పరిస్థితులు మారకపోవడం మరింత విషాదకరం.