Ayatollah Khamenei Iran crisis: ఇరాన్‌లో రోజు రోజుకూ అల్లర్లు పెరుగుతున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర కారణాలతో ప్రజలు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం నిసనలను బలవంతంగా అణచివేస్తోంది. ఆందోళనల వార్తలుమీడియాలో రాకుండా కట్టడి చేస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనలను బలవంతంగా అణచివేస్తే ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించారు. దీంతో నిరసనల వెనుక అమెరికా ఉన్నట్లు ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భావిస్తునానరు. దీంతో ఆయన దేశం వీడేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు ఖమేనీ ఇపపటికే పారిపోయాడని వార్తలు ప్రసారం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఖమేనీ కుటుంబ సభ్యులతో కలిసి 20 మంది కంటే తక్కువ సభ్యులతో రహస్యంగా వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని పేర్కొంటున్నాయి. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో ఆయన భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.
Also Read: టిడిపి కూటమిలో కొత్త మార్పులు.. నిజం ఎంత?
మాస్కోలో మకాం..
ఖమేనీ రష్యా రాజధాని మాస్కోకు బయలుదేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలో ఇరాన్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. ఇతర దేశాలు ఆశ్రయం ఇవ్వే అవకాశాలు తక్కువగా ఉండటంతో రష్యా మాత్రమే మిగిలిన ఆప్షన్‌గా మారింది. రష్యా-ఇరాన్ మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలు ఈ నిర్ణయానికి బలం చేకూరుస్తున్నాయి.
ఇరాన్ సంక్షోభ నేపథ్యం
ఇటీవల ఇరాన్‌లో ఆర్థిక సమస్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ ఆంక్షలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఖమేనీ పాలనలో పెరిగిన అస్తవ్యస్తతలు ప్రదేశవ్యాప్త మందగవళ్లకు దారితీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడు దేశాన్ని వదులుకోవడం అరుదైన సంఘటనగా మారింది.
Also Read: క్రెడిట్ కోసం జగన్ ఆరాటం!
ఖమేనీ వెళ్లిపోతే ఇరాన్‌లో కీలక నాయకత్వ లోపం ఏర్పడుతుంది, అంతర్గత కలహాలు తీవ్రమవుతాయి. మాస్కోలో ఆశ్రయం రష్యాకు మధ్యప్రాచ్యంలో ఆధిక్యతను పెంచుతుంది, ఇరాన్ విషయాల్లో జోక్యం పెరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ అవకాశాన్ని ఉపయోగించి ఇరాన్‌పై ఒత్తిడి పెంచవచ్చు. ఈ మలుపు మధ్యప్రాచ్య యుద్ధాలు, ఆయుధాల వ్యాపారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.