Shikhar Dhawan: టీమిండియా క్రికెట్లో గబ్బర్ గా పేరుపొందాడు శిఖర్ ధావన్. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు అతడు. అతడి ఆటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మైదానంలో ఆడినా.. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఇలా అన్నింట్లోనూ గబ్బర్ అనేక సంచలనాలు నమోదు చేశాడు.
2025 లో స్వీట్ షాక్ ఇచ్చిన గబ్బర్ అలియాస్ ధావన్.. 2026 లో మాత్రం అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయేషా ముఖర్జీని 2012లో పెళ్లి చేసుకున్నాడు శిఖర్. 2014లో ఆయేషా ఒక బాబుకు జన్మనిచ్చింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉన్నారు. 2023లో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత శిఖర్ చాలా రోజులపాటు ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించాడు. తన కొడుకు కోసం వేదన చెందాడు. అయితే ఇప్పుడు మరోసారి శిఖర్ వైవాహిక జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఫిబ్రవరి మూడో వారంలో అతడు తన ప్రేయసి సోఫీ షైన్ ను వివాహం చేసుకోబోతున్నాడు. ఢిల్లీలో వీరిద్దరికి సంబంధించి వివాహ వేడుకలు జరుగుతాయని సమాచారం.
శిఖర్ ధావన్ వివాహానికి టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్ నటులు హాజరవుతారు. సోఫీ ఐర్లాండ్ దేశానికి చెందిన యువతి. ఈమెతో చాలా రోజులుగా శిఖర్ సంబంధం లో ఉన్నాడు. 2025 ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ను శిఖర్ ధావన్ ఆమెతో కలిసి వీక్షించాడు. నీతో అప్పటినుంచి వారిద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిఖర్ .. తనకు కాబోయే భార్య తో దిగిన ఫోటోలను పంచుకున్నాడు. ఆమెతో కొన్ని సందర్భాలలో ఇతర ప్రాంతాలలో విహరించాడు. పైగా ఆమెను తన అదృష్ట దేవత అని శిఖర్ పలు సందర్భాలలో పేర్కొన్నాడు. చివరికి ఆమెతో ఉన్న సంబంధాన్ని వివాహం ద్వారా బలోపేతం చేసుకుంటున్నాడు ధావన్.