Sankranthi Movies 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల హవా మొదలైంది. ప్రస్తుతం స్టార్ హీరోలతోపాటు యంగ్ హీరోలు సైతం పోటీకి సిద్ధమవుతుండడం విశేషం… చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక వీళ్లతో పాటు రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి లాంటి నటులు కూడా ఉండడం విశేషం… ఇక రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా దాదాపు 600 నుంచి 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో ట్రేడ్ పండితులు ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ వరప్రసాద్ సినిమా సైతం 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టగలిగే కెపాసిటి ఉందని నమ్ముతున్నారు.
ఇక రవితేజ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా ఈజీగా 100 కోట్లను కలెక్ట్ చేస్తోంది. నవీన్ పోలిశెట్టి శర్వానంద్ సినిమాలకు 30 నుంచి 40 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ సంక్రాంతి సినిమాలు 1200 నుంచి 1300 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఈ సంక్రాంతికి టార్గెట్ అయితే ఫిక్స్ అయింది. మరి ఇందులో ఏ సినిమాలు ఎలాంటి రిసల్ట్ ను మూటగట్టుకుంటాయి. తద్వారా ఎంతటి కలెక్షన్స్ ని రాబడతాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చిన కూడా పండుగ సీజన్ ను చాలా బాగా క్యాష్ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి 1300 కోట్ల వరకు కలెక్షన్స్ రాకపోయిన కనీసం 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలుగుతాయనే ధోరణిలో మరి కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇక ఈ పోటీలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్ల సంఖ్య పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమాలతో ఎవరెవరు వాళ్ళ సత్తాను ప్రూవ్ చేసుకుంటారు? ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలబడతారు అనేది…