Kalvakuntla Kavitha : ఎప్పుడైతే నిన్న సాయంత్రం కవిత రాశారు అన్నట్టుగా లేఖలు బయటకు వచ్చాయో.. అవన్నీ ఫేక్ అని.. రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. యంగ్ ఇండియా కంపెనీలోకి పెట్టుబడులు పెట్టిన వారికి టికెట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారని.. ఇప్పుడు ఆయన పేరును ఈడి చార్జ్ షీట్లో నమోదు చేసిందని తెరపైకి సరికొత్త విషయాన్ని గులాబీ మీడియా ఎత్తుకుంది. నిన్నటి నుంచి కవిత లేఖలు తెలుగు మీడియాను షేక్ చేస్తున్న నేపథ్యంలో… యంగ్ ఇండియాలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని గులాబీ మీడియా వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చింది. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ లేఖల వ్యవహారమే మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. అయితే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ గులాబీ సుప్రీం కు రాసిన లేఖలు ఫేక్ అని..అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేసిన కుట్ర అని పింక్ పార్టీ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. అదే కాదు వాళ్ళ సొంత మీడియాలో గులాబీ ఎమ్మెల్సీ అసలు లేఖలే రాయనట్టు.. అదంతా కట్టు కథ అన్నట్టుగా నమ్మించడానికి విఫల ప్రయత్నం చేశారు. అయితే ఈ లెటర్ల విషయంపై మొత్తానికి ఎమ్మెల్సీ నోరు విప్పారు.
Also Read : బిడ్డ చెప్పినా.. బీజేపీపై కేసీఆర్ మౌనం ఎందుకు?
తన కుమారుడి గ్రాడ్యుయేషన్బిడ్డ చెప్పినా.. బీజేపీపై కేసీఆర్ మౌనం ఎందుకు? వేడుక నిమిత్తం గులాబీ ఎమ్మెల్సీ కవిత అమెరికా వెళ్ళిపోయారు. తన భర్తతో కలిసి కుమారుడి గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు తను రాసిన లెటర్లపై కవిత నోరు విప్పారు.” సరిగ్గా రెండు వారాల క్రితం నేనే కేసీఆర్ కు లెటర్స్ రాశాను. నాకు పర్సనల్ ఎజెండా అంటూ ఏమీ లేదు. ఇంటర్నల్ గా రాసిన లెటర్ బయటకు రావడం వెనుక ఏదో కుట్ర కోణం ఉంది. కొందరు కోవర్టులు ఆ లెటర్లను బయటికి పంపించేలా చేశారు. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని.. కుతంత్రాలు చోటు చేసుకున్నాయని నేను ఎప్పుడో చెప్పాను. కెసిఆర్ దేవుడు. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. త్వరలోనే వారందరూ వెళ్ళిపోతారు. ఇది కచ్చితంగా తథ్యం. ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే వాటిని ఏర్పాటు చేసిన కేసీఆర్ చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ దాకా తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ కొంతమంది ఆ లక్ష్యాన్ని దూరం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకు కచ్చితంగా కాలం సమాధానం చెబుతుందని” కవిత పేర్కొన్నారు. మొన్నటిదాకా సామాజిక తెలంగాణ రాలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత.. ఇప్పుడు కెసిఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతోంది.
కుమారుడి గ్రాడ్యుయేషన్ డే వేడుక పూర్తి అయిన తర్వాత భర్త, చిన్న కొడుకుతో కలిసి కవిత స్వదేశానికి బయలుదేరారు. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత.. తనను కలిసిన మీడియా మిత్రులతో కవిత పై వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు ఆమె ఎటువంటి మొహమాటం లేకుండా తనే లెటర్స్ రాశానని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే ఇది ఎటువైపు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.