Allu Arjun Case : గత ఏడాది డిసెంబర్ నాల్గవ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని అరెస్ట్ చేయడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా తప్పు మొత్తం అల్లు అర్జున్ దే అంటూ ఆయన క్యారక్టర్ దెబ్బ తినేలా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ చెప్తున్నవి మొత్తం అబద్దాలే అంటూ పోలీసులు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మరీ ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మాకు అందజేయాలని హ్యూమన్ రైట్స్ కమీషన్ పోలీసులను ఆదేశించింది. అయితే ఈ నివేదిక ని విచారించిన కమీషన్ పోలీసులు సరైన వివరాలు అందించలేదని మండిపడింది.
Also Read : గంటకు 11 వేల టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు నెలకొల్పిన ‘ఖలేజా’ రీ రిలీజ్!
పోలీస్ స్టేషన్ కి దగ్గర్లో డీజేలతో అంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కమీషన్ నిలదీసింది. పోలీసులు ఇచ్చిన ప్రాధమిక నివేదిక లో అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, మేము ఎలాంటి లాఠీ చార్జి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ కి నిజమ్గానే లిఖిత పూర్వకంగా అనుమతిని నిరాకరించినప్పుడు అతను థియేటర్ కి ఎలా వచ్చాడు? అంటూ పోలీసులను నిలదీసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ మేరకు కమీషన్ సీవీ ఆనంద్ కి నోటీసులు జారీ చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తూ న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని, కాస్త ఆలస్యం అయినా మంచి వాడికి మంచినే జరుగుతుందని, కావాలని పోలీసులు తాము రక్షణ కల్పించడం లో విఫలం అవ్వడంతో అల్లు అర్జున్ మీదకు నేరాన్ని మొత్తం నెట్టేశారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కమీషన్ ఇచ్చిన నోటీసుల పై పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
మరో పక్క ఈ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ నిన్న మొన్నటి వరకు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చావు తో పెద్ద పోరాటమే చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ కుర్రాడు ఇప్పుడు సురక్షితంగా బయటపడి రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళాడు. రీసెంట్ గానే అక్కడికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ విచ్చేసి శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి ని అడిగి తెలుసుకున్నాడు. ఇప్పటికే ఆ కుర్రాడికి రెండు కోట్ల రూపాయిల సహాయసహకారాలతో పాటు, వైద్యానికి అయిన ఖర్చు మొత్తాన్ని అల్లు అర్జున్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్ వైద్యానికి అవసరమయ్యే డబ్బులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి శ్రీతేజ్ బాగానే ఉన్నాడు, కానీ మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడు. త్వరలోనే ఆయన ఆ సమస్య నుండి కూడా బయటపడి సంపూర్ణమైన ఆరోగ్యం తో తన తోటి పిల్లలతో కలిసి చదువుకుంటూ, ఆడుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్కు నోటీసులు జారీ చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్
సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అడజేయాలని జనవరిలో పోలీసులను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్
పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు… pic.twitter.com/N4IdzMuTd0
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2025