MLC Kavitha : అమెరికాలో కొడుకు గ్రాడ్యుయేషన్ డేకు కవిత వెళ్లిపోయింది. అక్కడ కొడుకు తో కలిసి ఫోటోలు దిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ యాదృచ్ఛికంగా గులాబీ క్యాంపు నుంచి ఎటువంటి ప్రశంసలు కవిత పోస్టుకు దక్కలేదు. ఇక కవిత రాసిన లెటర్స్ బయటకు రిలీజ్ కావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఈ లెటర్స్ పై గులాబీ పార్టీ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ..ఏదో గాయి గత్తర చేయబోయింది గాని.. ఇప్పుడు కవితనే నేనే ఆ లెటర్స్ రాశానని ఒప్పుకుంది. మరి ఈ లెక్కన ఆ పార్టీ మౌత్ పీస్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి.. అన్నట్టు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి దిగగానే కవితను విలేకరులు చుట్టుముట్టారు. వాళ్లు ఏం అడుగుతారో కవితకు తెలుసు. పైగా తన మనసులో ఎలాంటి భావం ఉందో కూడా ఆమెకు తెలుసు. అందుకనే నేరుగా చెప్పేసింది..” ఆ లెటర్స్ రాసింది నేనే. కానీ అది ఇంటర్నల్ మేటర్. అలాంటి లెటర్స్ లీక్ చేసింది ఎవరో మీరే ఇమాజిన్ చేసుకోండి. కెసిఆర్ దేవుడు లాంటి వ్యక్తి. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. కెసిఆర్ లీడర్ షిప్ లోనే పనిచేస్తాను. నాకు వేరే వ్యాపకాలు లేవు. పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ గురించి ఇలాంటి లెటర్స్ రాయడం మాకు కామనే. కానీ ఈసారి మాత్రమే బయటికి ఎక్స్పోజ్ అయింది. కానీ ఈ లెటర్స్ ని చూసి కాంగ్రెస్, బిజెపి నాయకుకు ఎగిరి ఎగిరి పడుతున్నారు. కోతికి కొబ్బరి హాయ్ దొరికినట్టుగా వారు సంబర పడాల్సిన అవసరం లేదు ” ఇవీ విలేకరులతో కవిత మాట్లాడిన మాటలు క్లుప్తంగా..
Also Read : లేఖ పై తొలిసారి స్పందించిన కవిత.. కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు
వాస్తవానికి నిన్నటి నుంచి కవిత లెటర్స్ మీద విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది.. కేసీఆర్ క్యాంపు నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు. కవిత వర్గాల నుంచి కూడా ఎటువంటి కూడా రాలేదు. దాసోజు శ్రవణ్ లాంటి కొంతమంది నాయకులు స్పందించినప్పటికీ.. అధికారికంగా గులాబీ పార్టీ నుంచి ఎటువంటి ఖండనలు లేవు. అయితే కవిత పై కెసిఆర్ కు కోపం ఉందని, కేటీఆర్ కూడా అలానే ఉన్నాడని.. శంషాబాద్ లో శుక్రవారం చోటుచేసుకున్న పరిస్థితులు చెబుతున్నాయి. కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ ప్రాంతానికి గులాబీ పార్టీ నాయకులు రాలేదు. అక్కడ గులాబీ పార్టీ జెండాలు కనిపించలేదు. కేటీఆర్, ఇతర నాయకుల ప్రస్తావన కనిపించలేదు. కేవలం జాగృతి నాయకులు, లీడర్లు మాత్రమే అక్కడ కనిపించారు. టీం కవిత అనే పేరుతో కొన్ని ప్లకార్డులు కనిపించాయి. మొత్తంగా చూస్తే పార్టీ పరంగా ఆమెకు దూరంగా ఉండాలని కెసిఆర్ క్యాంప్ నుంచి ఆదేశాలు వచ్చాయని అనుకోవాలా?
కెసిఆర్ దేవుడైతే ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? కవిత ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? కెసిఆర్ కోటరీలోకి వెళ్లే ధైర్యం కేటీఆర్, హరీష్ రావుకు మాత్రమే ఉంటుంది. మహా అయితే సంతోష్ రావు కొంత పరిధిలోకి వెళ్ళగలడు. అలాంటప్పుడు కెసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? హరీష్ రావు తో కవితకు విభేదాలు లేవు. అంటే ఒక రకంగా కవిత పొలిటికల్ గ్రోతింగ్ కు కేటీఆర్ అడ్డుపడుతున్నాడా? అందువల్లే ఆమె రాసిన లెటర్ బయటకు వచ్చిందా? అంటే సోదరుడితో ఉన్న ఆగాధం కాస్త పెరుగుతున్నట్టే భావించాలా? కానీ కవిత వ్యాఖ్యలతో ఒక స్పష్టత వచ్చినట్టు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఒకవేళ ఇది గనుక కేసీఆర్ కుటుంబం ఆడుతున్న నాటకం అయితే.. దానికి కాలమే సమాధానం చెబుతుంది. మొత్తానికి కవిత వేస్తున్న అడుగులు.. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు.. ఆలోచనలు జనానికి ఒక క్లారిటీ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని తండ్రికి ఒక రకమైన హెచ్చరిక పంపింది. ఇప్పుడేమో దయ్యాల ప్రస్తావని తీసుకొచ్చింది. మొత్తంగా కెసిఆర్ అనే వ్యక్తి నీడ నుంచి దూరంగా జరిగి.. సొంతంగా తన రాజకీయ కార్యశాలను నిర్మించుకోబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది..