KA Paul: భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దొంగలను దొంగలే అంటారని.. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎవరూ నమ్మడం లేదని సెటైర్లు వేశారు.. కెసిఆర్ పై అనవసరంగా విమర్శలు చేస్తే నాలుక చీరేస్తానని మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేరిపోయారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా సిగ్గుమాలిన తనం అని కేఏ పాల్ మండిపడ్డారు.
Also Read: ‘అఘోరీ’ మగాడే..రిమాండ్ రిపోర్ట్ లో వణుకుపుట్టిస్తున్న సంచలన నిజాలు!
కేఏ పాల్ ఏమన్నారంటే..
” తెలంగాణ ముఖ్యమంత్రి, సోదరుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కీలక వ్యాఖ్యలు చేశారు.. బయటికి వెళ్తే భిక్షగాళ్ల మాదిరిగా చూస్తున్నారని.. ఎవరూ నమ్మడం లేదని అన్నారు. తిరంగా అక్కడిదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది.. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. కెసిఆర్ హయాంలో ఏడు లక్షల కోట్లు అప్పయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత అది 9 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ తొమ్మిది లక్షల కోట్లకు వడ్డీ ఎవరు చెల్లించాలి? ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది.. తెలుగు ప్రజలారా.. ఈ ముఖ్యమంత్రులు మారి కొత్త పార్టీలు అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. వీరు ఉన్నంతవరకు ప్రజల సమస్యలు పరిష్కారం కావు. పైగా మరిన్ని అప్పులు చేస్తారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టాల్సింది మీరే. అలాంటప్పుడు ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నుకొని ఇబ్బంది పడొద్దు. గత వారా నేను వాషింగ్టన్ డిసి వెళ్ళాను. అక్కడ వివిధ వ్యాపారస్తులను కలిశాను. నాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తే నేను వివిధ వ్యాపారస్తులతో మాట్లాడి వేలు, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించేవాడిని. దీనివల్ల ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేవి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. కానీ ఇవన్నీ చేద్దామని అడిగితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రారు. వస్తామని చెబుతారు. కానీ ముందుకు మాత్రం రారు. ఇప్పటికైనా వారు ముందుకు వస్తే నా వంతుగా నేను సహాయం అందిస్తానని” కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అటు ప్రతిపక్షాలు.. ఇటు మేధావులు రేవంత్ రెడ్డి పై చేస్తున్న విమర్శలు ఒక ఎత్తు అయితే.. కేఏ పాల్ చేసిన విమర్శలు మరొక ఎత్తుగా ఉన్నాయి. మొత్తంగా కేఏ పాల్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Dr.K.A Paul’s Amazing counter to
C M Revanth Reddy cry pic.twitter.com/UJu2yeSZlr— Dr KA Paul (@KAPaulOfficial) May 6, 2025